బింబిసార 2 అసలు వర్కౌట్ అయ్యేనా? ఫాన్స్ లో అనుమానాలు
TeluguStop.com
నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) కి సుదీర్ఘ కాలం తర్వాత ఒక సక్సెస్ ని తెచ్చి పెట్టిన సినిమా బింబిసారా( Bimbisara ).
వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా యొక్క సీక్వెల్ పై నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఆసక్తిని కనబరుచుతున్నాడు.
కళ్యాణ్ రామ్ కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు అనేది అందరికీ తెలిసిందే.కెరియర్ ఆరంభించి రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అయినా అందుకున్న సక్సెస్ లు మూడు మాత్రమే.
"""/" / ఆ మూడు సక్సెస్ లో బింబిసార ఒకటి.అందుకే బింబిసారా సినిమా యొక్క సీక్వెల్ చేయాలని కళ్యాణ్ రామ్ చాలా ఆశ పడుతున్నాడు.
ఒకవేళ బింబిసారా సినిమా సీక్వెల్ చేస్తే కచ్చితంగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాను అని ఉద్దేశం తో కళ్యాణ్ రామ్ ఉన్నాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సీక్వెల్ ఎంత వరకు వర్కౌవుట్ అవుతుంది అనేది అనుమానంగా ఉంది.అందుకు కారణం దర్శకుడు సీక్వెల్ విషయం లో ఆసక్తిగా లేడని తెలుస్తోంది.
ఆయన ఇతర హీరోలతో కమిట్మెంట్స్ కుదుర్చుకున్నాడు. """/" /
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తో సినిమా చేసేందుకు గాను స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దాంతో చిరు ని ఒప్పించగలిగితే వెంటనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అందుకే బింబిసారా సినిమా సీక్వెల్ కి దర్శకత్వం వహించే ఉద్దేశం తనకు లేదు అంటూ దర్శకుడు తప్పుకున్నాడట.
దాంతో కళ్యాణ్ రామ్ ఒక టీం ఏర్పాటు చేసి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ఆ టీం కి దర్శకుడు వశిష్ట లీడ్ గా ఉంటాడు.ఆయన ఇతర సినిమాల స్ట్రిప్ట్ వర్క్ చేసుకుంటూనే ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొనబోతున్నాడు.
స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆయనకు సంబంధం లేదు అన్నట్లుగా సీక్వెల్ చిత్రీకరణకు దూరంగా ఉండబోతున్నాడట.
మొత్తానికి బింబిసారా సినిమా విషయంలో నందమూరి అభిమానుల్లోనే కాకుండా ఇతరుల్లో కూడా పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.
ఒక వేళ ఇది రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కూడా వర్క్ అవుట్ అయ్యేనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్ని అనుమానాల మధ్య కళ్యాణ్ రాముడు ఈ సినిమా ను చేయడం అవసరమా అంటూ నందమూరి అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి కి వస్తున్నాం సినిమా కోసం భారీ ప్రమోషనల్ వీడియో చేస్తున్న అనిల్ రావిపూడి…