ఈ దీవిలో కేవలం కోటీశ్వరులే ఉంటారు.. ఇక్కడి భవనాలు చూస్తే..!

ఈ భూ ప్రపంచంలో ఎన్నో స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పవచ్చు.అయితే వీటిలో కొన్నింటి గురించి కొద్దిమంది తప్ప మిగతా ప్రపంచానికి తెలియదని చెప్పవచ్చు.

అలాంటి ప్రదేశాల్లో నైజీరియాలోని బనానా ఐలాండ్ అనే ఒక ద్వీపం కూడా ఉంది.

ఈ ద్వీపం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.ఈ ద్వీపానికి ప్రత్యేకతలున్నాయి.

ఇది ఒక ప్యాలెస్ లాగానే ఉంటుంది.ఈ ఐలాండ్‌లో కేవలం కోటీశ్వరులే నివసిస్తారు.

నిజానికి ఈ దీవిని ధనవంతులు అందరూ కలిసి నిర్మించారు.ఈ ఐలాండ్‌లో ఎక్కడ చూసినా ఇంద్రభవనాలే దర్శనమిస్తాయి.

ఈ ద్వీపం అరటిపండు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.

ఈ దీవిలో ఇల్లు కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అస్సలు సాధ్యం కాదు.

ఎందుకంటే ఇందులో కొన్ని అడుగుల భూమే లక్షల రూపాయలు అవుతుంది.ఇక ఇళ్ల ధరలు కోట్లలో ఉంటాయి.

పారిస్, న్యూయార్క్, టోక్యో వంటి మోస్ట్ పాపులర్ సిటీలకు దీటుగా ఈ కృత్రిమ ద్వీపాన్ని నైజీరియాలో ఎంతో ఇష్టంగా ధనవంతులు కట్టుకున్నారు.

ఈ ఐలాండ్ నిర్మాణం 2003లో పూర్తయింది.402 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ఇసుకతో నిర్మించారు.

విశేషమేంటంటే, ఈ ద్వీపంలో ఒక చదరపు మీటరు భూమి ఖరీదు ఏకంగా రూ.

84 వేలు అట.ఇక్కడ ఒక మామూలు ఇల్లు ధర రూ.

21 కోట్లకు పై మాటే! ఇక విలాసవంతమైన ఇల్లు కొనాలంటే రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సిందే.

"""/" / ఈ ప్రదేశం ఇంత ఖరీదుగా ఉండటానికి ఒకటే కారణం.అదేంటంటే, నైజీరియాలో బాగా రద్దీగా ఉండే లాగోస్‌ సిటీకి ఇది చాలా దూరంగా ఉంటుంది.

ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.ఈ ద్వీపంలో సెక్యూరిటీకి కొదవుండదు.

అలాగే చాలా ప్రైవసీ ఉంటుంది.ఉరుకులు పరుగులు తీసే ప్రపంచానికి దూరంగా ఉంటుంది.

ఇక్కడ లైఫ్ చాలా బిందాస్ గా అనిపిస్తుంది.ఈ ధనవంతుల ద్వీపంలో అన్ని సౌకర్యాలు లభిస్తాయి.

దుకాణాలు, షోరూమ్‌లు, రెస్టారెంట్ లతో సహా ప్రపంచంలో ఉన్నవన్నీ ఇక్కడ కనిపిస్తాయి.

రానా లీడర్ 2 లో అనుకోని ట్విస్ట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల…