రిపోర్టర్ తో డేటింగ్ చేస్తున్న బిల్ గేట్స్ మాజీ భార్య
TeluguStop.com
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.ఆయన మాజీ భార్య మిలిండా ఫ్రెంచ్ గేట్స్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు.
ఈ ఇద్దరూ 1994లో వివాహ బంధంతో ఒకయ్యారు.వీరికి ముగ్గురు పిల్లలు కూడా.
కానీ ఏమైందో ఏమో 27 ఏళ్ల వీరి చక్కటి వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు.
విడాకులు తీసుకున్నప్పటికీ.బిల్-మిలిండాలు కలిసి ఏర్పాటు చేసిన బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ను సంయుక్తంగానే నడుపుతున్నారు.
బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్టు కూడా మిలిండా గేట్స్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం ఈ బాధ నుంచి మిలిండా గేట్స్ ఉపశమనం పొందుతున్నట్టు తెలుస్తోంది.బిలీనియర్ అయిన మిలిండా గేట్స్ మళ్లీ ప్రేమలో పడినట్టు సమాచారం.
58 ఏళ్ల మిలిండా గేట్స్.మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ తో డేటింగ్ చేస్తున్నట్టు ఒక ఆన్‌లైన్ టాబ్లాయిడ్ రిపోర్టు చేసింది.
గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది.
కానీ వీరిద్దరూ ఎలా కలిశారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు.డ్యూ, మిలిండా గేట్స్ ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు మీడియాకు చిక్కారు.
ఏప్రిల్ ప్రారంభంలో నెట్స్‌కి, సెలాటిక్స్‌కి మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ గేమ్‌కి వీరిద్దరూ కలిసి వెళ్లారు.
ప్రస్తుతం వీరు ప్రేమ లోకంలో విహరిస్తున్నట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/11/Melinda-Gates-dating-Jon-Du-Pre-after-Bill-orce!--jpg"/
మిలిండా గేట్స్‌కి వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే కాక.
మరో ప్రైవేట్ ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది.ఆ అకౌంట్‌ను జాన్ డ్యూ ప్రీ ఫాలో అవుతున్నారు.
బిల్-మిలిండా 20 ఏళ్ల కూతురు ఫోబ్ గేట్స్ కూడా ఆ అకౌంట్‌ను అనుసరిస్తున్నారు.
ఫోబ్.టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ అకౌంట్‌ను ఫాలో అవుతున్నట్టు తెలిసింది.
వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలు మార్లు మీడియా కంటికి చిక్కారు.మరోవైపు, ఈ కథనాలపై మిలిందా కానీ, జాన్ డ్యూ ప్రీ కానీ ఇంతవరకు స్పందించలేదు.
దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది.మరోవైపు, బిల్ గేట్స్, మిలిందాకు ముగ్గురు సంతానం ఉన్నారు.
"""/"/
60 ఏళ్ల డ్యూ ప్రీ తన లింక్డిన్ ప్రొఫైల్‌లో స్ట్రాటజిస్ట్ కమ్యూనికేషన్స్ స్పెషలిస్టుగా పేర్కొన్నారు.
వీడియో ప్రొడక్షన్, బ్రాడ్‌కాస్టింగ్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ వంటి వాటిల్లో ఆయనకు 35 ఏళ్ల అనుభవం ఉన్నట్టు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలిసింది.
ఫాక్స్ న్యూ ఛానల్‌కి టీవీ కరెస్పాండెంట్‌గా కూడా ఆయన పనిచేశారు.అయితే ఈ రూమర్లపై మిలిండా గేట్స్ కానీ, డ్యూ ప్రీ కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గతేడాది మే నెలలో మిలిండా గేట్స్, బిల్ గేట్స్ విడిపోయారు.తమ 27 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.
తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.ఆ తర్వాత మూడు నెలల్లోనే అంటే ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి.
వారు విడిపోయినప్పటికీ.మిలిండా గేట్స్ తన పేరులో తన కుటుంబం పేరుని తొలగించలేదు.
"""/"/
2021 చివరిలో బిల్‌గేట్స్ ఇయర్ ఎండ్ నోటును షేర్ చేశారు.ఆ నోటులో 2021 ఏడాది వ్యక్తిగతంగా ఎంతో బాధను మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన జీవితంలో ఇదే అత్యంత కష్టమైన ఏడాదని అన్నారు.ఈ మార్పును అంగీకరించడం చాలా కష్టం, కానీ తప్పదని అన్నారు.
తన ప్రియమైన వారు ముఖ్యంగా పిల్లలు ఈ కష్టతరమైన సమయాన్ని నెట్టుకురావడంపై తాననెంతో ఆకట్టుకుందని 67 ఏళ్ల బిల్ గేట్స్ తన గేట్స్‌నోట్స్ బ్లాగ్‌లో రాశారు.
ఒకవైపు వివాదం.. మరోవైపు సరికొత్త రికార్డులు అల్లు అర్జున్ కే ఇది సాధ్యమైందా?