తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చిన బిల్‎గేట్స్..!

కరోనా వైరస్‎ను సృష్టించి దానిని ప్రపంచ దేశాల మీదకు వదిలారనే కుట్ర సిద్ధాంతాలను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‎గేట్స్ తిప్పికొట్టారు.

ఆ వైరస్‎కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని బిల్‎గేట్స్ స్పష్టం చేశారు.కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఎంతగానో డబ్బును ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయినప్పటికీ తనపై ఇలాంటి దుష్ర్ఫచారం జరుగుతుందో అర్ధం కావడం లేదని వాపోయారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని కోరారు.

కరోనా వైరస్‎ను అడ్డుకునేందుకు త్వరగా టీకాలు రావాలని బిల్‎గేట్స్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

ఈ విషయంలో అన్ని దేశాలు వరల్డ్ హెల్త్ఆర్గనైజేషన్ కు సహకరించాలని సూచించారు.ఎలాంటి వైరస్ నైనా ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్‎ను సిద్ధం ఉండాలని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు పలు అర్ధాలు తీసి తనపై ఆరోపణలు వేస్తున్నారని బిల్‎గేట్స్ అన్నారు.

ఈ వ్యాఖ్యల ఆధారంగా కరోనా వైరస్ పుట్టుకకు బిల్‎గేట్స్ కారణమంటూ సోషల్ మీడీయాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

ఈ వీడియోను యూట్యూబ్ లో కోట్ల సంఖ్యలో వీక్షించారు.ప్రపంచంలో 15 శాతం జనాభాను చంపేయాలన్నదే బిల్‎గేట్స్ లక్ష్యమని వీడియోలో ఉంది.

తనపై జరుగుతున్న కుట్ర సిద్ధాంతాలపై బిల్‎గేట్స్ స్పందించారు.కరోనా మహమ్మారి, సోషల్ మీడియాలది ఓ దుష్ట కలయిక అన్నారు బిల్‎గేట్స్.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని, ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నామని చెప్పుకొచ్చారు.

కరోనాపై పోరాడేందుకు ఇప్పటికే 250 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించిన బిల్‎గేట్స్.గత 20 ఏళ్లలో అనేక దేశాల్లో వైద్య సదుపాయాల అభివృద్ధికి వందల కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

ప్రజలను టీకాలతో చంపేసి డబ్బు సంపాదించాలనుకునే నీచమైన మనస్తత్వం తమది కాదని బిల్‎గేట్స్ స్పష్టం చేశారు.

తమకు వ్యాక్సిన్లతో అనుబంధం ఉన్న మాట నిజమే కానీ మీరు అనుకుంటున్నట్లు కాదని తెలిపారు.

నిజానిజాలేమిటో అర్ధం చేసుకుంటారన్న నమ్మకం తనకుందని బిల్‎గేట్స్ వివరణ ఇచ్చారు.2015లో జికా వైరస్ బయట పడినప్పుడూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయని బిల్‎గేట్స్ చెప్పుకొచ్చారు.

9 నెలల్లో 6 సినిమాలు విడుదల.. ఈ స్టార్ హీరోకు పోటీనిచ్చే మరో హీరో ఉన్నారా?