బికినీపై సిగ్నల్ ఇస్తోన్న బ్యూటీ.. పట్టించుకునేవారే లేరట!

టాలీవుడ్‌లో దశాబ్ధ కాలంగా తన అందాల ఆరబోతతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను అలరిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రస్తుతం తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది.

తమన్నా చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరీర్ ఫేడవుట్ అయ్యేందుకు రెడీగా ఉంది.

ఇప్పటికే అవకాశాలు అంతంత మాత్రంగా వస్తున్న తమ్మూ, ఇప్పుడు తిరిగి అవకాశాలను సంపాదించుకునేందుకు ఎత్తులు వేస్తోంది.

ఈ క్రమంలోనే ఆమె తన అందాల ఆరబోతలో మరో అడుగు ముందుకేసి, ఏకంగా బికినీ షోలకు ఓకే చెప్పేసింది.

సినిమాలో తన పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి బట్టలు వేసుకోవడానికైనా రెడీ అంటోంది ఈ బ్యూటీ.

హీరోతో సంబంధం లేకుండా అందాలను ఆరబోసేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ.దీంతో తమన్నా బికినీ అందాలను చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయ్యారు.

కానీ అసలు సమస్య ఇక్కడే ఉందని తెలుస్తోంది.తమన్నా అందాలను పదేళ్లకు పైగా చూస్తూనే వస్తున్నారని, ఇప్పుడు కొత్తగా ట్రై చేసినా ప్రేక్షకులు ఎక్కువకాలం ఆమెను పట్టించుకోక పోవచ్చని పలువురు అంటున్నారు.

దీంతో తమన్నాకు సినిమా ఛాన్సులు ఇవ్వాలంటేనే దర్శకనిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

మరి తమన్నా అందాల ఆరబోతకు దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తారా లేరా అనేది పక్కనబెడితే, ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన సంపద్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

సురేఖావాణి పుట్టినరోజు.. కూతురు ప్రేమతో చేసిన ఈ పోస్ట్ కు ఫిదా అవ్వాల్సిందే!