బైక్ దొంగ,వాటిని కొన్న స్క్రాప్ దుకాణ యజమాని రిమాండ్:సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : బైకు దొంగ ( Bike Thief )వాటిని కొన్న స్క్రాప్ దుకాణ యజమాని రిమాండ్ పంపించిన డి.
ఎస్.పి చంద్రశేఖర్ రెడ్డి( DSP Chandrasekhar Reddy ).
కు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ తేదీ 26.06.
2024 ఉదయం 7:15 గంటలకు ఎల్లారెడ్డిపేట్ ఎస్సై కి వచ్చిన నమ్మదగిన సమాచారం పై ఎల్లారెడ్డిపేట బస్ స్టాప్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి సూపర్ ఎక్సెల్ బైక్ పై గొల్లపల్లి వైపు వస్తుండగా పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించగా అతని పేరు షేక్ మహబూబ్ తండ్రి నబిష వయస్సు 32 సంవత్సరాలు కులం పకీర్ గ్రామం బండపల్లి మండలం చందుర్తి అని తెలిపి ప్రస్తుతం నారాయణపూర్ గ్రామంలో అతని తల్లి వద్ద ఉంటున్నానని తెలిపి .
తాను జనవరి నెలలో వెంకటాపూర్ గ్రామ శివారులో ఉన్న సాయిబాబా గుడిలో దొంగతనం చేసి హుండీ పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను పదివేల రూపాయలు,సాయిబాబా ఆవు దూడ విగ్రహాలను దొంగలించి వాటిని బొప్పాపూర్ గ్రామ శివారులో ఉన్న ఇనుప సామాన్ దుకాణ యజమాని అయిన అనరాసి కిష్టయ్య అనే అతనికి అమ్మడని తెలిపి అంతేకాకుండా నెల రోజుల క్రితం ఒక సూపర్ ఎక్సెల్ వేములవాడ నుండి దొంగతనం చేసి దానిని తీసుకుని వచ్చి 5000 రూపాయలకు స్క్రాప్ యజమాని అయిన అనరాసి కిష్టయ్యకు అమ్మడం జరిగిందని అదే క్రమంలో 21.
6 2024 రోజున మరొక సూపర్ ఎక్సెల్ బైక్ ను దొంగతనం చేసి దాన్ని అనరాసి కిష్టయ్యకు అమ్మడానికి వచ్చి షాప్ వద్ద పెట్టి మళ్లీ వేములవాడ వెళ్లి అదే రోజు రాత్రి సమయంలో మరొక సూపర్ ఎక్సెల్ బైక్ దొంగతనం చేసి దానిపై ఇప్పటివరకు తిరుగుతూ ఈరోజు ఉదయం కిష్టయ్యకు అమ్మడానికి వెళ్తుండగా పోలీసు వారు పట్టుకున్నారని తెలిపి తాను అమ్మిన రెండు సూపర్ ఎక్సెల్ బండిలను కిష్టయ్య దుకాణం వద్ద చూపిస్తానని తెలుపగా ఎస్సై బొప్పాపూర్ శివారులో ఉన్న కిష్టయ్య దుకాణం వద్దకు వెళ్లి అక్కడ స్క్రాప్ దుకాణం వద్ద రెండు సూపర్ ఎక్సెల్ బండ్లు కిష్టయ్య సమక్షంలో స్వాధీనం చేసుకొని ఇద్దరితోపాటు మూడు సూపర్ ఎక్సెల్ బండి లను తీసుకుని వచ్చి వారిద్దరిని రిమాండ్ కు తరలించగా మెజిస్ట్రేట్ 15 రోజుల కస్టడీ అనుమతి ఇవ్వడం జరిగింది.
‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..