ఇంట్లో బైక్ స్టంట్లు.. సరదా తీరిపోయింది!
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలలో మనల్ని నవ్వించేవి కొన్ని ఉంటాయి.కొన్ని మనల్ని ఏడిపిస్తాయి.
కొన్ని మనల్ని షాక్‌కి గురిచేస్తాయి.ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో చాలా మంది రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు.చేతులు వదిలేసి బైక్‌లు నడుపుతున్నారు.
తర్వాత నిర్లక్ష్యంగా వాహనంపై గంతులు వేస్తున్నారు. """/" / ఇలాంటివి చేయడం వల్ల వారి ప్రాణాలు ప్రమాదంలో పడడమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలోకి నెట్టేసిన వారు అవుతున్నారు.
సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు.తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పలువురు ఇదే కోవలో బైక్ స్టంట్స్ చేసి ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు మనం నిత్యం చూస్తున్నాం.
అయినా ఎవరూ మారడం లేదు.నిర్లక్ష్యంగా ఇలా వాహనాలపై స్టంట్స్ చేస్తున్నారు.
ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.అయితే ఓ యువకుడు మాత్రం విభిన్నంగా స్టంట్స్ చేశాడు.
దీనికి సంబంధించి ఆసక్తికర విషయం తెలుసుకుందాం. """/" /
నడిరోడ్డుపై బైక్‌లపై విన్యాసాలు చేయొద్దని పోలీసులు అందరికీ చెబుతుంటారు.
ఇలా నిబంధనలను ఉల్లంఘించి బైక్ స్టంట్స్( Bike Stunts ) చేసే వారికి భారీగా ఫైన్స్ వేస్తుంటారు.
దీనికి ఉపాయంగా ఓ యువకుడు విభిన్నంగా బైక్ స్టంట్స్ చేశాడు.అయితే అందరిలా రోడ్డు మీద మాత్రం చేయలేదు.
ఇంట్లో గదికి గడియ పెట్టి లోపల ఇలా చేశాడు.వీడియోలో, ఒక యువకుడు బైక్( Bike )తో కనిపించి, తన గదిలో బైక్ స్టంట్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.ఆ యువకుడు రోడ్డుపై కాకుండా తన గదిలోనే విన్యాసాలు చేయడం.
అతనిని చూస్తుంటే, అతను ఈ పనిలో చాలా నిపుణుడు అని అనిపిస్తుంది.అయితే ఆ యువకుడి స్టంట్ బెడిసి కొట్టింది.
బైక్‌పై నుంచి అతడు పడిపోయాడు.దీంతో అతడికి దెబ్బలు తగిలాయి.
ఇలాంటి పనులు చేయడం ఎంత ప్రమాదకరమో అతడికి తెలిసి వచ్చింది.
సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ ఇలా