ఇద్దరు అమ్మాయిలతో బైక్ రైడింగ్.. కానీ ఇంతలోనే ఊహించని షాక్
TeluguStop.com
బైక్ రైడింగ్ అంటే యూత్‌కు ఎంత క్రేజ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బైక్ మీద రయ్ మంటూ దూసెకెళ్లడం అంటే చాలా ఇష్టం.అయితే ఈ బైక్ రైడింగ్ అనేది సరదాగా ఉండాలి కానీ చాలాసార్లు అదే విషాదాంతం అవుతోంది.
ఎందుకంటే బైక్ మీద స్పీడుగా వెళ్తున్నప్పుడు ఏదైనా కొంచెం మిస్టేక్ అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
చాలాసార్లు అబ్బాయిలు అమ్మాయిల ముందు అనవసర బిల్డప్ లకు పోయి తమ ప్రాణాలను రిస్క్ లో పడేసుకుంటున్నారు.
ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది.దీన్ని చూసిన తర్వాత అనవసరంగా బిల్డప్ లకు పోతే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది.
ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ వ్యక్తి ఇలాగే అమ్మాయిల ముందు లేని బిల్డప్‌కు పోయి నవ్వుల పాలయ్యాడు.
అలాగే తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.ఓ రాత్రి సమయంలో కొందరు బైక్ రైడ్లు చేస్తున్నారు ఓ చోట.
అక్కడ ఓ యువకుడు దగ్గర ఇద్దరు అమ్మాయిలు నిలబడి మాట్లాడటం మనం చూడొచ్చు.
ఇక అతను ఆ ఇద్దరినీ బైక్ మీద ఎక్కించకుకుని రైడ్ చేయాలనుకుంటున్నాడు. """/" /
ఇందులో ఒక అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకుని మరో అమ్మాయిని మాత్రం వెనకాల కూర్చోబెట్టుకుని బైక్‌ను స్పీడుగా డ్రైవ్ చేయాలని అనుకుంటాడు.
ఇక రైడ్ స్టార్ట్ చేసేముందు ఓవర్ గా ఎక్సలేటర్‌ను తిప్పేస్తాడు.బైక్‌ను కొంచెం స్కిడ్ చేసినట్టు చేసి స్పీడుగా స్టార్ట్ చేస్తాడు.
అయితే ముందు అమ్మాయి కాస్త ఎత్తుగా ఉండటంతో అతనికి ముందు ఏముందో కనిపించదు.
ఇంకేముంది ఎదురుగా ఉన్న బైకులను ఢీకొడుతాడు.దెబ్బకు ముగ్గురు కింద పడిపోతారు.
దీన్నంతా కూడా కొందరు వీడియో అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డెలివరీ తర్వాత జుట్టు అధికంగా రాలిపోతుందా.. అయితే ఈ ఆయిల్ మీ కోసమే..!