మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..!!
TeluguStop.com
R5 జోన్ పై చంద్రబాబు( Chandrababu Naidu ) చేసిన వ్యాఖ్యలకు వైసీపీ పార్టీకి చెందిన నేతలు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో పులివెందులలో.వైసీపీ నేతలు నిరసనలు తెలియజేయడం జరిగింది.
అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేశారు.
సీఎం జగన్( CM Jagan ) పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
ఇక ఇదే రీతిలో కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కూడా అమరావతిలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వటంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బైక్ ర్యాలీ( Bike Rally ) నిర్వహించి నిరసన తెలియజేశారు.
ఇక ఇదే విషయంపై వైద్యశాఖ మంత్రి విడదల రజని( Minister Vidadala Rajini ) సైతం నిరసన తెలియజేశారు.
R5 జోన్ పై చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పల్నాడులో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీలో మంత్రి విడదల రజిని బైక్ నడపడం జరిగింది.పేదలంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా.రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చాం అని మంత్రి రజిని స్పష్టం చేయడం జరిగింది.
వామ్మో.. భారతీయులు ఆన్లైన్లో షాపింగ్ ఇలా చేస్తున్నారా..?