మేనల్లుడిపై మోజు పడిన అత్త.. భర్త, ఇద్దరు పిల్లలను కాదని..?
TeluguStop.com
ఇటీవలే జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.
కేవలం శారీరక సుఖం కోసం కుటుంబ బంధుత్వాలను మంటలో కలుపుతున్నారు కొందరు మూర్ఖులు.
వివాహం తర్వాత కుటుంబ బంధాలకు విలువ ఇస్తేనే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది.
అలాకాకుండా కేవలం శారీరక సుఖం మాత్రమే కావాలి అనుకుంటే చివరికి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఒక్క సంఘటన వింటే తెలుస్తుంది.
ఓ మహిళ తన మేనల్లుడు పై( Nephew ) మోజు పడింది.ఏకంగా భర్త, ఇద్దరు పిల్లలను కాదని మేనల్లుడుతో ఊరు వదిలి పారిపోయింది.
ఆ తర్వాత ఏం జరిగిందో అనే వివరాలను చూద్దాం.వివరాల్లోకెళితే.
బీహార్ లోని( Bihar ) భాగల్పూర్ జిల్లా సుల్తాన్ గంజ్ లోని మిర్హట్టి గ్రామంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన మేనల్లుడితో ప్రేమలో పడింది.
మేనల్లుడు జీవితాంతం తోడుగా ఉంటానని ఆ అత్తకు మాట ఇచ్చాడు.ఆ మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలను కాదని మేనల్లుడు తో ఊరు వదిలి పారిపోయింది.
భర్త తన భార్య కోసం వెతకడం ప్రారంభించాక.మేనల్లుడితో తన భార్య లేచిపోయిన విషయం తెలిసింది.
"""/" /
భార్య తప్పు చేసినా కూడా తిరిగి రావాలని భార్యకు ఫోన్ చేసి ఆ భర్త అభ్యర్థించాడు.
ఇద్దరు పిల్లలను గుర్తు తెచ్చుకొని ఇంటికి రావాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య మాత్రం మేనల్లుడి పై ఉండే పిచ్చి ప్రేమతో ఆ మాటలను పట్టించుకోలేదు.
తాను ఎప్పటికీ ఇంటికి రానని ఖరాఖండిగా భర్తకు తేల్చి చెప్పేసింది.అయితే మేనల్లుడు తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు నెలలు గడిచిన తర్వాత ఆమెకు తన పిల్లలు గుర్తుకు వచ్చారు.
"""/" /
దీంతో తిరిగి ఇంటికి వచ్చింది.కానీ ఆమె భర్త మాత్రం ఇంటిలో పలికి రానివ్వలేదు.
దీంతో ఆ మహిళ ఇంటిముందు నానా హంగామా చేసి, తాను ఎవరితో పారిపోలేదని, తాను పాదయాత్రకు వెళ్లానని తెలిపింది.
గ్రామంలో ఉండే వ్యక్తులు కూడా భార్యను తిరిగి తీసుకెళ్లేందుకు భర్తను ఒప్పించే ప్రయత్నం చేశారు.
కానీ ఇంటి పరువు తీసిన భార్యతో కలిసి ఉండేదే లేదని, ఆమెను ఇంట్లోకి రానిచ్చేదే లేదని తేల్చి చెప్పేశాడు.
నులిపురుగుల సమస్యకు ఈ ఇంటి చిట్కాలతో చెప్పండి బై బై..!