వీడెవడో నిజమైన జాతిరత్నం.. ఎగ్జామ్‌లో సమాధానంగా సినిమా పాట రాసేశాడు..

పరీక్షలకు చాలా మంది విద్యార్థులు సరిగ్గా సన్నద్ధం అవ్వరు.కొన్ని సార్లు రేపు పరీక్ష ఉందనగా ఈ రోజు రాత్రి పుస్తకాలు తిరగేస్తారు.

రాత్రంతా ఏదో ఒకటి చదివి, పరీక్షల్లో తమకు వచ్చింది రాసేస్తారు.కొందరు పరీక్ష పత్రాన్ని కూడా సరిగ్గా చూడకుండా, ఆన్సర్ షీట్ నింపేస్తారు.

పేజీలన్నీ నింపేస్తే పేపర్లు దిద్దే వారు కొన్ని మార్కులు వేసి పాస్ చేస్తారనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.

అందుకే ఇచ్చిన ప్రశ్న ఒకటైతే, వారు రాసే సమాధానాలు మరొకటిగా ఉంటాయి.తాజాగా ఇలాంటి అనుభవం ఓ విద్యార్థికి ఎదురైంది.

పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ అవని ఆ విద్యార్థి పరీక్షలో వచ్చిన ప్రశ్న చూసి ఏ మాత్రం కంగారు పడలేదు.

గతంలో తాను చూసిన సినిమా పాటను దానికి జవాబుగా రాసేశాడు.ఆ జవాబుపత్రం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.బీహార్‌లోని చాప్రా ప్రాంతంలో జయప్రకాష్ యూనివర్సిటీ ఉంది.

ఇటీవల బీఏ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.అందులో మద్య పాన నిషేధంపై ప్రశ్న వచ్చింది.

దానికి బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కృపా సంధు రాసిన ఆన్సర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

"""/"/మద్యపాన నిషేధం గురించి రాయమంటే భోజ్‌పురి సినిమా పాటను అతడు రాశాడు.

భోజ్‌పురి సూపర్‌స్టార్ అయిన ఖేసరీ లాల్ యాదవ్ ఆల్‌టైమ్‌ హిట్ సాంగ్స్‌లలో 'నాథునియా' కూడా ఒకటి.

దీనిని యూట్యూబ్‌లో విడుదల చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.ఆ హిట్ సాంగ్ లిరిక్స్‌ను మన కృపాసంధు రాసేశాడు.

దీనికి సంబంధించిన ఫొటో వైరల్ కాగానే చాలా మంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టసాగారు.

వీడెవడో నిజమైన జాతిరత్నంలా కనిపిస్తున్నాడని చాలా మంది పేర్కొన్నారు.దీనిపై జయప్రకాష్ యూనివర్సిటీ ప్రతినిధులను మీడియా సంప్రదించింది.

దీనిపై స్పందించడానికి వారు నిరాకరించారు.