బీహార్ ఎన్నికల పై సీఈసీ ప్రకటన
TeluguStop.com
ఒకపక్క కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో బీహార్ లో ఎన్నికల నగారా మోగింది.
దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.సీఈసీ సునీల్ అరోరా ఈ రోజు మీడియా తో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.
బీహార్‌తో పాటు 16 రాష్ట్రాల్లోని 56 నియోజకవర్గాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు.
మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ అరోరా తెలిపారు.అక్టోబర్ 28వ తేదీన తొలి దశ ఎన్నికలు జరగనుండగా నవంబర్ 3వ తేదీన రెండవ దశ, అలానే నవంబర్ 7వ తేదీన మూడవ దశ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
16 జిల్లా ల్లో 71 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, రెండవ దశలో 94 స్థానాలకు.
17 జిల్లాల్లో మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
అలానే నవంబర్ 10 న ఫలితాలు కూడా వెల్లడిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.
బీహార్ అసెంబ్లీ టర్మ్ ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన పూర్తి కానున్నది.
243 స్థానాల్లో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినట్లు అరోరా తెలిపారు.మరోపక్క కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలను పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కు 23 లక్షల గ్లౌజ్ లు,7 లక్షల శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
సోషల్ డిస్టాన్సింగ్ కారణంగా.అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లు ఉంటాయని తెలిపారు.
ప్రతి పోలింగ్ బూత్‌లో 1500 మందికి బదులుగా వెయ్యి మందికి ఓటింగ్ అవకాశం కల్పించనున్నారు.
మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను బీహార్ ఎన్నికలను వాడనున్నారు.కోవిడ్19 పాజిటివ్ రోగులకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ అరోరా తెలిపారు.
కోవిడ్ వల్ల క్వారెంటైన్‌లో ఉన్నవారికి కూడా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు.అయితే ఎన్నికల రోజున చివరి గంట కోవిడ్19 రోగులకు అనుమతి కల్పించారు.
వారి వారి పోలింగ్ స్టేషన్ల వద్ద ఈ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
భారతీయులకు శుభవార్త .. ఇకపై అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్