పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ బ్యాచ్ కి దూల తీర్చేసిన అమర్ దీప్..!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం ఎంత వాడావేడి వాతావరణం లో కొనసాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

నిన్న సగం నామినేషన్స్ జరగగా, ఈరోజు మిగిలిన నామినేషన్స్ జరగబోతున్నాయి.ఈరోజు జరగబోయే నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మరియు అమర్ దీప్ మధ్య వాడివేడి వాతావరణం మధ్య వాదనలు జరిగాయి.

మొదటి సారి వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు పల్లవి ప్రశాంత్ మీద జనాల్లో సానుభూతి పెరిగింది.

కానీ ఇప్పుడు మాత్రం అమర్ దీప్( Amardeep Chowdary ) కి అనుకూలంగా మారింది.

అమర్ దీప్ శివాజీ ని నామినేట్ చేసినందుకు గాను పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ని నామినేట్ చేస్తాడు.

గత వారం లో అమర్ దీప్ శివాజీ( Shivaji ) కి చెయ్యి బాగాలేక, మిగిలిన కంటెస్టెంట్స్ రేంజ్ లో కస్టపడి ఆడలేదు కాబట్టి, ఆయనని నేను కెప్టెన్సీ టాస్కు నుండి తొలగిస్తున్నాను అని చెప్పి తొలగిస్తాడు.

"""/" / అలాగే భోలే శవాలీ( Bhole Shavali ) శివాజీ ని కెప్టెన్సీ కంటెండర్ చెయ్యడం కోసం తన కంటెండర్ షిప్ ని త్యాగం చెయ్యడం పై అమర్ దీప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ భోలే ని నామినేట్ చేస్తాడు.

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ అనేది చాలా ముఖ్యమైనది, దానిని అతి తేలికగా తృణపాయం లో వదిలేసాడు, కరెక్ట్ కాదని అమర్ దీప్ దానికి వివరణ ఇస్తాడు.

ఈ రెండు కారణాలు నచ్చక పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ని నామినేట్ చేస్తాడు.

ఇక్కడి నుండి దాదాపుగా వీళ్లిద్దరి మధ్య గంట సేపు వాగ్వివాదం జరిగింది.అమర్ దీప్ లేవనెత్తిన పాయింట్స్ కి ప్రశాంత్ దగ్గర సమాధానం లేదు.

మీరందరు ఫిజికల్ గా ఎంతో కస్టపడి ఆడారని మీకోసం అలోచించి నేను శివాజీ అన్నని తప్పించాను.

కానీ నువ్వు దానిని అడ్డం పెట్టుకొని నన్ను నామినేట్ చేసావు అంటూ అమర్ దీప్ ప్రశాంత్ ని నిలదీసాడు.

"""/" / నీకు ఇష్టమైన వాళ్ళని నామినేట్ చేసినందుకు ఇప్పుడు నన్ను నామినేట్ చేసావు.

కండబలం లేకపోతే బుద్ధిబలం ఉపయోగించి నామినేట్ చేసాడు అంటున్నవ్ కదా, మరి ఆరోజు నువ్వు ప్రియాంక బెలూన్ ని ఎందుకు పగలగొట్టావ్ రా, సరైన కారణం చెప్పు అని అంటాడు.

దానికి పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )నుండి సమాధానం రాలేదు.వేరే పాయింట్ ని లాక్కొచ్చి ఏదేదో మాట్లాడాలని చూస్తాడు.

మధ్యలో ఆయనకీ ఎప్పుడూ సపోర్టు ఉండే శివాజీ దూరుతాడు.మీరు వాడికి సపోర్ట్ చెయ్యాలనుకుంటే వాడికే సపోర్ట్ డైరెక్ట్ గా చెయ్యండి అని అంటాడు.

అలా చర్చ నడుస్తుండగా మళ్ళీ భోలే శవాళీ దూరుతాడు.కోపం కట్టలు తెంచుకున్న అమర్ దీప్ కుర్చీని కాళ్లతో కొట్టి మధ్యలో మాట్లాడితే పగిలిపోతాది అని అంటాడు.

మొత్తం మీద జరిగిన చర్చ లో అమర్ దీప్ కి సోషల్ మీడియా లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

మరి ఈ చర్చ పై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.

హైదరాబాద్ లో కొత్త ఇల్లు కడుతున్న అల్లు అర్జున్.. ఏకంగా అలాంటి సౌకర్యాలతో?