బిగ్ బాస్ 5 మొదటివారం బెస్ట్ విశ్వ.. వరస్ట్ జెస్సీ..!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటివారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మెన్స్ ల ఎంపిక నిర్వహించారు.

బిగ్ బాస్ ఆదేశాల మేరకు కెప్టెన్ తో పాటుగా మిగతా ఇంటి సభ్యులు ఈ వారం మొత్తం బెస్ట్ పర్ఫార్మ్ చేసిన వారితో పాటుగా వరస్ట్ పర్ఫార్మ్ చేసిన వారిని ఎంపిక చేయాలని సూచించారు.

ఈ క్రమంలో హౌజ్ మేట్స్ తమ తమ అభిప్రాయాల మేరకు బెస్ట్, వరస్ట్ ల గురించి చెప్పారు.

అయితే బెస్ట్ పఫార్మర్ గా విశ్వ హయ్యెస్ట్ ఓట్స్ తెచ్చుకోగా వరస్ట్ పర్ఫార్మర్ గా జశ్వంత్ అలియాస్ జెస్సీని ఎంపిక చేశారు.

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి వారం బెస్ట్ పర్ఫార్మర్ గా విశ్వ ఎంపికవడం విశేషం.

ఇక వరస్ట్ పర్ఫార్మర్ గా జెస్సీ ని ఎంపిక చేశారు.ఇక వరస్ట్ పర్ఫార్మర్ గా నిలిచిన జెస్సీని బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు జైలులో ఉంచాలని చెప్పారు.

అనీ మాస్టర్ తో గొడవ వల్లే జెస్సీకి నెగటివ్ మార్కులు పడ్డాయి.ఈ క్రమలో హౌజ్ మేట్స్ అంతా వరస్ట్ పర్ఫార్మర్ గా ఎంచుకున్నారు.

అంతేకాదు ఈ వారం నామినేషన్స్ లో కూడా జెస్సీ ఉన్నాడు.మరి ఈ వారం అతను సేఫ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

కొలంబియా వర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లు .. భారీగా అరెస్ట్‌లు, న్యూయార్క్ పోలీసులపై ట్రంప్ ప్రశంసలు