బిగ్ బాస్ రోహిత్ సోషల్ మీడియా ఎకౌంట్ హ్యాక్..!

బిగ్ బాస్ సీజన్ 6 లో కపుల్స్ గా వెళ్లిన రోహిత్ మెరినాలు మొదట్లో ఇద్దరు కలిసి ఒకే కంటెస్టంట్ గా పరిగణించబడ్డారు.

కొద్దివారాల వర్వాత బిగ్ బాస్ వారిద్దరిని సోలో కంటెస్టంట్స్ గా మార్చాడు.అప్పటి నుంచి ఇద్దరు తమ ఆట ప్రదర్శిస్తూ వచ్చారు.

రోహిత్ 13వ వారం వరకు కొనసాగుతూనే ఉన్నాడు.మెరినా మాత్రం 10వ వారమే ఎలిమినేట్ అయ్యి హౌస్ వదిలి వెళ్లింది.

అయితే ఆమె వెళ్లిన తర్వాతనే రోహిత్ తన పూర్తి ఫోకస్ ఆట మీద పెడుతూ వచ్చాడు.

ప్రస్తుతం టాప్ 5 రేసులో కూడా రోహిత్ ఉన్నాడు.చివరి వారం వరకు వెళ్లినా వెళ్లకపోయినా సరే రోహిత్ ఇప్పటివరకు రావడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు.

అఫ్కోర్స్ అతనికి ఆ కేపబిలిటీ ఉంది.ఇక ఫైనల్ వీక్ రాబోతున్న టైం లో రోహిత్ సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్ స్టాగ్రాం ఖాతా హ్యాక్ అయ్యింది.

మెరినా బయటకు వచ్చాక అది కూడా ఆమె చూస్తుంది.రోహిత్ కి సపోర్ట్ చేసే వారంతా కూడా అందులో కామెంట్స్ చేస్తుంటారు.

కానీ ఇప్పుడు ఆ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది.ఈ విషయాన్ని మెరినా తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసింది.

ఇది ఎవరు చేశారో తెలియదు తామైతే కంప్లైంట్ చేశామని చెప్పింది.రోహిత్ ఓటింగ్ మీద దెబ్బ వేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.