బిగ్ బాస్ ఓటీటీ.. చివరి నిమిషంలో హెల్త్ ఇష్యూతో ర్యాపర్ ఔట్
TeluguStop.com
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి బిగ్ బాస్ వచ్చేందుకు సిద్ధమయ్యాడు.బిగ్ బాస్ డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా రాబోతున్న నేపథ్యంలో అందరి చూపు కూడా దీని పైన ఉంది, నేడు సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ అవబోతుంది బిగ్ బాస్ ఓటీటీ షో కు మంచి ఆదరణ వస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ వాళ్ల గురించి వీడియోలు ప్రసారం చేస్తూ.
వారి యొక్క డ్యాన్స్ షోలను చూపిస్తూ ఆరంభ ఎపిసోడు అద్భుతంగా సాగిందట.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ ఎపిసోడ్ నేడు సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే.
ఈ షో లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించబోతున్నట్లు గా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
నాగార్జున కూడా ప్రోమో లో అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.కానీ చివరకి హౌస్ లోకి 17 మంది మాత్రమే వెళ్లారని సమాచారం అందుతుంది.
ఒక్కరు మిస్ అయ్యారు. """/"/
వారు మిస్ అయ్యారా లేదంటే సీక్రెట్ రూమ్ లోకి వెళ్లారా అనే ప్రచారం మొదలు అయ్యింది.
కానీ ఆ ఒక్కరూ అనారోగ్య కారణంతో హౌస్ లోకి వెళ్ళ లేదని తెలుస్తోంది.
ఆ ఒక్కరు ఎవరో కాదు రోల్ రైడా.ఈయన పాత కంటెస్టెంట్స్ అనే విషయం తెలిసిందే.
గత సీజన్ లో ఈయన సందడి చేశాడు.తన సాంగ్స్ తో తెగ హడావుడి చేయడంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు.
అందుకే ఈ సారి ఆయనకు అవకాశం దక్కింది.ఈసారి ట్రోఫీ సొంతం చేసుకుంటాను అని నమ్మకం తో వెళ్లాలి అనుకున్న రోల్ రైడా కు అనూహ్యంగా అనారోగ్య కారణంతో అవకాశం దక్కలేదు.
కాళ్ళు సమస్య వల్ల ఆయన బయటనే ఉండాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది.మొత్తానికి రోల్ రైడా వెళ్లకుండా మిగతా వాళ్ళు వెళ్లి అప్పుడే సందడి మొదలు పెట్టారు.
నేడు సాయంత్రం 6 గంటలనుండి ప్రారంభం కాబోతున్న ఈ షో ఏకధాటిగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
అంటే రోజులో 24 గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూసే అవకాశం ఉంటుంది.
లైవ్ కాకున్నా ప్రతిరోజు వారు ఏ నిమిషానికి ఏం చేస్తున్నారు అనేది చూడవచ్చు.
కనుక ప్రేక్షకులు చాలా ఎక్సైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?