ఓ రేంజ్ లో ఫైమా దూకుడు.. టాప్ 5 ఫిక్స్..!
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైమా దూకుడు కనబరుస్తుంది.జబర్దస్త్ షోలో ఆమెకి ఆల్రెడీ సూపర్ క్రేజ్ ఏర్పడింది.
ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి వచ్చింది.అయితే బిగ్ బాస్ లో ఆమె మొదటి రోజు నుంచి అంచనాలకు తగినట్టుగా ఆడుతూ వస్తుంది.
ఫైమా కన్నా జబర్దస్త్ టీం లీడర్ అయిన చలాకి చంటి నిరుత్సాహ పరచగా ఫైమా మాత్రం హౌస్ లో తన మార్క్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది.
అంతేకాదు అమ్మడి చేస్తున్న కామెడీ.చూపిస్తున్న ఆట తీరుకి బిగ్ బాస్ ఆడియన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు.
టాస్కుల్లో కూడా ఫైమా హౌస్ లో ఉన్న అందరి ఫీమేల్ కంటెస్టంట్స్ కన్నా ఎక్కువ పోటీ ఇస్తుంది.
ఇక ఇదే దూకుడు కొనసాగిస్తే మాత్రం ఫైమా తప్పకుండా టాప్ 5 లో ఉండి తీరుతుందని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఆమె తన ఆట తీరుతో పాటుగా హౌస్ లో తన కామెడీతో కూడా అలరిస్తుంది.
అందుకే ఆమెని బిగ్ బాస్ ఆడియన్స్ ఇష్టపడ్డారు.తనకు వచ్చిన ఈ సదవకాశాన్ని వాడుకోవడంలో సక్సెస్ అయ్యింది ఫైమా.
అయితే ఆట జరిగింది కేవలం ఆరు వారాలు మాత్రమే మరో ఎనిమిది తొమ్మిది వారాలు పాటు ఆట ఉంది.
మరి ఫైమా ఇదే ఫాం కొనసాగించి టాప్ 2 కి చేరుతుందా ఇప్పుడున్న టాప్ 5 రేసులోంచి తొలగిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.
బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ.. దేవర మూవీ విషయంలో తప్పు అక్కడే జరుగుతోందా?