బిగ్‌బాస్ 6 : శ్రీహాన్ గ్రాఫ్‌ అలా అలా పెరిగి పోతుంది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో పెద్దగా అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన శ్రీహన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

నెగిటివ్ గానో లేదా పాజిటివ్ గానో ఏదో ఒక విధంగా జనాల దృష్టిని శ్రీహాన్ ఆకర్షిస్తున్న నేపథ్యంలో ముందు ముందు అతడికి మంచి అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందంటూ బిగ్‌ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిరి హనుమంతు యొక్క ప్రియుడిగా ఇన్నాళ్లు శ్రీహాన్ ని ప్రేక్షకులు చూశారు, కానీ ఇక నుండి ఆయన్ని ఆయనగా చూసే రోజులు రాబోతున్నాయంటూ ప్రస్తుతం బిగ్‌ బాస్ చూస్తుంటే అనిపిస్తుంది అంటారు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహన్ ఇప్పటికే టాప్ పొజిషన్ లో ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇటీవల ఎపిసోడ్ లో జరిగిన పరిణామాలతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది.

ముఖ్యంగా ఇనాయా యొక్క ఇష్యూ లో అతడు చేసింది తప్పా రైటా అనే విషయం గురించి చర్చించుకుంటూ చాలా మంది చాలా రకాలుగా అతడిని సోషల్‌ మీడియా లో హైలెట్ చేస్తున్నారు.

అలా ఆయన గురించి చర్చ చేయడం ద్వారా సోషల్ మీడియా లో పాపులారిటీని దక్కించుకుని మంచి ఓట్లు పొందుతున్నాడు అంటూ చర్చ జరుగుతుంది.

ఈ వారం కూడా నామినేషన్ లో ఉండబోతున్న శ్రీహన్ తప్పకుండా సేవ్ అవుతాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇనాయా యొక్క ప్రవర్తన శ్రీహాన్ కి మరింత గా ప్లస్ పాయింట్ అవుతుంది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి శ్రీహాన్ టాప్ 5 వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని కొందరు అంటూ ఉంటే మరి కొందరు ఆయన కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బయట నుండి సిరి ఎలాగూ గొప్ప గా పబ్లిసిటీ చేస్తూ ఓట్లు దక్కించుకునేలా చేస్తోంది.

క్యాండీ క్రష్ గేమ్ కోసం రూ.30 లక్షల చర్చి నిధులు వాడేసిన పాస్టర్‌..??