బిగ్ బాస్ 6 : షాకింగ్ ఎలిమినేషన్..?

బిగ్ బాస్ సీజన్ 6 నుంచి తొమ్మిదొవ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగనుంది.

సండే రోజు టెలికాస్ట్ అయ్యే ఎలిమినేషన్ ఎపిసోడ్ ఇప్పటికే షూట్ చేశారు.ఇక బిగ్ బాస్ లీకుల నుంచి వచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఓ స్ట్రాంగ్ కంటెస్టంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

హౌస్ లో ఫెమినిస్ట్ గా ఉంటూ మొన్నటిదాకా ఆరోహి.ఇప్పుడు ఇనయాకి చాలా దగ్గరైన ఆర్జే సూర్య హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది.

"""/"/ ఆర్జే సూర్య ఎలిమినేషన్ నిజంగానే ఆడియన్స్ కి షాకింగ్ అని చెప్పొచ్చు.

హౌస్ లో టాస్కుల విషయంలో తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తూ వస్తున్న సూర్య ఎలిమినేషన్ అవాక్కయ్యేలా చేస్తుంది.

ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది.

ఈ వారం అందరు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉండగా అందరి కన్నా సూర్యకి తక్కువ ఓటింగ్స్ పడినట్టు తెలుస్తుంది.

మరి సూర్య ఎలిమినేషన్ లైవ్ చూసి ఆడియన్స్ ఏవిధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.

 బిగ్ బాస్ హౌస్ మెట్స్ కి కూడా ఆర్జే సూర్య ఎలిమినేషన్ బిగ్ షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.

సూసేకి పాటకు వధువు క్యూట్ డ్యాన్స్.. వీడియో వైరల్..