బిగ్ బాస్ 6 : మళ్ళీ ఇనయా వర్సెస్ శ్రీహాన్..!
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ వర్సెస్ ఇనయ సుల్తానా ఫైట్ కొనసాగుతూనే ఉంది.
లాస్ట్ వీక్ అడవిలో వేట టాస్క్ లో ఇనయా పోలీస్ గా.శ్రీహాన్ దొంగగా ఉన్నప్పుడు జరిగిన గొడవలో శ్రీహాన్ ని వాడు అన్నందుకు ఇనయా మీద చాలా సీరియస్ అయ్యాడు శ్రీహాన్.
ఇక అదే టైం లో కెప్టెన్సీ టాస్క్ విషయంలో తన గురించి సంచాలక్ అయిన రేవంత్ కి ఏదో చెబుతుండగా ఏ పిట్టొచ్చి కూసినా నువ్వు వినకు అన్నాడు.
అక్కడ తనని పిట్ట అన్నందుకు చాలా ఫీల్ అవుతూ శ్రీహాన్ మీద గొడవకు దిగింది ఇనయా.
వీకెండ్ నాగ్ క్లారిటీ ఇచ్చినా సరే వీళ్లిద్దరి మధ్య ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంది.
ఈ వీక్ నామినేషన్స్ లో కూడా ఇనయా వర్సెస్ శ్రీహాన్ ఆ పిట్ట అనే దాని మీదే గొడవకు దిగారు.
ఓవిధంగా శ్రీహాన్ ఇనయా మీద కావాలని సెటైర్స్ వేస్తున్నటు అనిపిస్తుంది.అయితే ఇనయా ఇదే దొరికింది ఛాన్స్ అని ఫుల్ కంటెంట్ ఇచ్చేలా దూసుకెళ్తుంది.
ఈవారం సుదీపా కూడా ఇనయాని నామినేట్ చేసింది.రేవంత్ కి ఒక నామినేషన్.
ఇనయాకి ఒక నామినేషన్ వేసింది సుదీపా.