బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ తో హగ్గులు.. నచ్చలేదన్న సిరి మదర్..!

బిగ్ బాస్ 5, 12 వ వారంలో ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్ లోకి వస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు వారి ఆటపై అభిప్రాయాలను కూడా చెప్పేస్తున్నారు.బుధవారం ఎపిసోడ్ లో కాజల్ వాళ్ల భర్త, కూతురు హౌజ్ లోకి వచ్చారు.

ఇక మరోపక్క ఈరోజు శ్రీరాం చంద్ర వాళ్ల సిస్టర్ హౌజ్ లోకి వస్తున్నట్లు  తెలుస్తుంది.

ఇక వీరితో పాటుగా మానస్ వాళ్ల అమ్మ గారు హౌజ్ లో సందడి చేశారు.

సిరి వాళ్ల మదర్ కూడా హౌజ్ లోకి వచ్చారు.మానస్ వాళ్ల మదర్ మానస్ కు రివర్స్ గా సరదాగా మాట్లాడుతూ అలరించారు.

ఆమె కోసం బిగ్ బాస్ ఓ బేబీ సాంగ్ ప్లే చేశారు.ఇక మరోపక్క సిరి వాళ్ల అమ్మ గారు మాత్రం దేవి మాలతో హౌజ్ లోకి వచ్చారు.

హౌజ్ లోకి రాగానే సిరి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది.అయితే షణ్ముఖ్ తో హగ్గులు తనకి నచ్చలేదని చెప్పింది సిరి మదర్.

గేం లో అతను సిరికి బాగా హెల్ప్ చేస్తున్నాడు.అందువల్ల సిరి అతనికి బాగా దగ్గరవుతుంది అని అన్నారు.

ఆ కామెంట్ తో షణ్ముఖ్ షాక్ అయ్యాడు.వీరిద్దరి వ్యవహారంపై రోజు కామెంట్స్ వస్తూనే ఉన్నాయని తెలిసిందే.

కొడుకు పుట్టడంతో ఆ అలవాటు మార్చుకున్నా… హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్