బిగ్ బాస్ 5 : రెండో వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌజ్ మేట్స్..!

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింది.ఏ సీజన్ లో లేనన్ని గొడవలతో బిగ్ బాస్ సీజన్ 5 మొదటివారం కొనసాగింది.

ఇక సెకండ్ వీక్ కూడా మొదటిరోజే నామినేషన్స్ తో హౌజ్ మేట్స్ మధ్య గొడవ మొదలు పెట్టాడు బిగ్ బాస్.

ఈసారి హౌజ్ లో ఉన్న 18 మందిని రెండు గ్రూపులుగా విడిపొమ్మని చెప్పి.

ఆ రెండు గ్రూప్స్ కు నామినేషన్స్ ప్రక్రియ జరిపాడు.అంటే క్లోజ్ గా ఉన్న వారు సైతం వేరు వేరు గ్రూపుల్లో ఉండాల్సిన పరిస్థితి.

కొద్దిగా గొడవలవుతున్న వారు సైతం ఒకే గ్రూప్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈ వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగినట్టు ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది.

మొదటి వారం మొత్తం స్మార్ట్ గా.సైలెంట్ గా అందరిని అబ్సర్వ్ చేసిన శ్వేత వర్మ కూడా ఈసారి నామినేషన్స్ లో ఫైర్ అయ్యింది.

ఆమె లోబో, హమిదల మీద ఫైర్ అయ్యింది.ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో మొదటి వారం కన్నా మరో హౌజ్ మేట్ ఎక్కువ అంటే లాస్ట్ వీక్ ఆరుగురు కంటెస్టంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఈ వారం ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

వారు కూడా ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, ఆర్జే కాజల్, జశ్వంత్, లోబో, అనీ మాస్టర్, ప్రియాంకా సింగ్ నామినేషన్స్ లో ఉంటారని తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే3, శుక్రవారం 2024