బిగ్ బాస్ 5 : నువ్వు లోపల ఆడు.. నేను నీకోసం బయట నుండి ఆడతా..!

బిగ్ బాస్ సీజన్ 5 నుండి యాంకర్ రవి ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది.

ఇక బయటకు వెళ్తూ హౌజ్ మెట్స్ కు సలహాలు ఇచ్చిన రవి శ్రీరాం, సన్నీ, షణ్ముఖ్ లకు పాస్ బోర్డ్ ఇచ్చి మిగతా వారికి ఫెయిల్ బోర్డ్ ఇచ్చాడు.

ఇక శ్రీరాం చంద్రకు నువ్వు లోపల ఉండి ఆడు.నీ కోసం నేను బయట ఉండి ఆడుతా అని హామీ ఇచ్చాడు.

ప్రస్తుతానికి టైటిల్ ఫైట్ సన్నీ వర్సెస్ షణ్ముఖ్ అనిపించేలా ఉన్నా రవి బయటకు వచ్చాక శ్రీరాం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు రవి వెళ్తూ వెళ్తూ షణ్ముఖ్ తో కూడా నేను వెళ్లడమే నీకు మంచిది అని చెప్పాడు.

అంటే రవి బయట షణ్ముఖ్ కి ఫేవర్ గా కూడా ఓటింగ్ జరిపించే అవకాశం ఉందని అనిపిస్తుంది.

తప్పకుండా షణ్ముఖ్, శ్రీరాం లనే టాప్ 2లో చూడాలన్నది రవి ఇంటెషన్ గా కనిపిస్తుంది.

అయితే ఆడియెన్స్ మాత్రం ఈ సీజన్ విన్నర్ సన్నీని చేయాల్సిందే అని ఉన్నారు.

మరి సన్నీ టైటిల్ రేసులో నిలుస్తాడా లేదా అన్నది చూడాలి.ఇప్పటివరకు సన్నీ టాప్ 2 ఫిక్స్ అవగా శ్రీరాం చంద్ర స్ట్రాంగ్ అయితే మాత్రం కష్టమే అని చెప్పాలి.

తిరుపతి జిల్లా చిల్లకూరులో భారీగా బంగారం సీజ్..!