బిగ్ బాస్ 5 లీక్స్ : ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ ఎవరంటే..!
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 5 నుండి ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్నారో లీక్ అవుతూనే ఉంది.
లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 లో 7వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది లీక్ అయ్యింది.
తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 5 నుండి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.
ఈ వారం నామినేషన్స్ టైం నుండి ప్రియ వర్సెస్ సన్నీ గొడవ అందరికి తెలిసిందే.
సన్నీని కావాలని ప్రియ రెచ్చగొట్టి అతని ఆటని డిస్ట్రబ్ చేయాలని చూసింది.అయితే బిగ్ బాస్ ఆడియెన్స్ మాత్రం సన్నీ ఆట తీరు చూసి అతన్ని గెలిపించాలని ఫిక్స్ అయ్యారు.
ఈ క్రమంలో సన్నీని టార్గెట్ చేసిన ప్రియని వారు ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈవారం నామినేషన్స్ లో రవి, ప్రియ, సిరి, జశ్వంత్, శ్రీరాం చంద్ర, కాజల్, అనీ ఉండగా సీక్రెట్ రూం లో ఉన్న లోబో కూడా డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు.
అయితే ఈ వారం లోబో ఏమి ఆట ఆడకపోయినా సన్నీ విషయంలో ప్రియ చేసిన అతి వల్ల ఆమెకు ఎలిమినేషన్ తప్పలేదు.
రెండేళ్ల తర్వాత గూగుల్ స్ట్రీట్ వ్యూలో భార్య ఆచూకీ.. చివరికేమైందో తెలిస్తే..?