బిగ్ బాస్ 5 : 12వ వారం నామినేషన్స్ ఉన్నది ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం నామినేషన్స్ ఎవరన్నది లీక్ అయ్యింది.

ప్రతి సోమవారం జరిగే ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఇంటి నుండి ఎవరిని బయటకు పంపించాలన్నది హౌజ్ మెట్స్ నిర్ణయించి నామినేట్ చేస్తారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారంగా నామినేషన్స్ ఉంటాయి.11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అవగా ఈ వారం కెప్టెన్ మానస్ తప్ప మిగతా ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది.

"""/" / హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు ఒక గ్రూప్ ఇంకో నలుగురు మరో గ్రూప్ అన్నట్టుగా పరిస్థితి కబడుతుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 5 12వ వారం నామినేషన్స్ లో రవి, సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర, ప్రియాంక, సిరి, కాజల్ నామినేట్ అయినట్టు తెలుస్తుంది.

అయితే వీరిలో ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

నామినేషన్స్ ప్రక్రియలో శ్రీరాం చంద్ర వర్సెస్ కాజల్, శ్రీరాం చంద్ర వర్సెస్ సన్నీ గొడవ జరిగినట్టు తెలుస్తుంది.

ఓ పక్క ఇప్పటికే బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తున్నారు.

 టైటిల్ పోరులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.అది కూడా సన్నీ వర్సెస్ షణ్ముఖ్ అని చెప్పుకుంటున్నారు.

చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం..: సజ్జల