కమిట్మెంట్ ఇచ్చి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని.. ఇనయా వైరల్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ ఇనయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇనయా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు చాలామందికి ఈమె ఎవరు అన్నది తెలియదు.

కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.

అయితే మొదట ఇనయా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు రెండు వారాల కంటే ఎక్కువ ఉండదని అనుకున్నారు.

కానీ ఇనయా మాత్రం టైటిల్ రేస్ లో దూసుకుపోతోంది.అంతేకాకుండా హౌస్ లో ప్రతి వారం కంటెస్టెంట్లు అందరూ ఇనయా ని టార్గెట్ చేస్తుండడంతో ఆమెకు సింపతి పెరిగిపోయి ఓట్ల మీద ఓట్లు పడుతున్నాయి.

కాగా ఇనయా వర్మతో కలిసి డాన్స్ చేయడంతో ఆమెకు ఒక బిగ్ బాస్ ఆఫర్ వరించింది.

క్రమంగా ఇనయా బిగ్ బాస్ ఒక సెలబ్రిటీగా మార్చేసింది.ఆమె ఇంకా హౌస్ లో నుంచి బయటకు రాకముందే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

చాలామంది ఇనయా టైటిల్ తప్పకుండా కొట్టాలి గెలవాలి కోరుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ఇనయా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లక ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో భాగంగా ఎటువంటి భయం లేకుండా క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి నోరు మెదిపింది.

ఇంటర్వ్యూలో భాగంగా ఇనయా మాట్లాడుతూ.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది లేదు అని చెప్పను.

కానీ ఇష్టం లేకుండా ఏ పని చేయలేము.అందుకే నాకు చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ నేను వదులుకున్నాను.

"""/"/ కాస్టింగ్ కౌచ్ అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు.ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎదురవుతూ ఉంటుంది.

నేను కూడా అలాంటివి ఎదుర్కొన్నాను.చాలామంది అడిగారు.

ఆ పని చేయడం ఇష్టం లేక సినిమాలు వదులుకున్నాను.ఆరోజు నేను ఒప్పుకుంటే ఈపాటికి పెద్దపెద్ద ప్రాజెక్టు చేసేదాన్ని.

కానీ నేను ఒక మంచి యాక్టర్ కావాలనుకున్నాను ఇలాంటివి కాదు.అందుకే వాటిని వదులుకున్నాను చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను.

నాకు సంతృప్తి ఉంది అని చెప్పుకొచ్చింది ఇనయా.ఎటువంటి కమిట్‌మెంట్‌లు లేకుండా సినిమాలు చేసుకుంటున్నాను నాకు హ్యాపీ ఉంది.

చాలామంది అమ్మాయిలు అనుకుంటారు.ఇండస్ట్రీ అంటేనే కమిట్‌మెంట్ అని.

కానీ అది నిజం కాదు.అది లేకుండా కూడా ఇండస్ట్రీలో ఉండొచ్చని నేను ప్రూవ్ చేస్తాను అని తెలిపింది ఇనయా సుల్తానా.

వామ్మో.. ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే! (వీడియో)