అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా…?

అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా…?

ఆదివారం రోజున స్టార్ మా ఛానెల్ లో గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టంట్లలో అమ్మ రాజశేఖర్ ఒకరు.

అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా…?

16 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అమ్మ రాజశేఖర్ కు నంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకోవాలని కోరిక.

అమ్మ రాజశేఖర్ భార్య ఎవరో మీకు తెలుసా…?

మొదట డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారారు.

గోపీచంద్ హీరోగా రణం సినిమాను తెరకెక్కించి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

నితిన్ టక్కరి, రవితేజ ఖతర్నాక్ సినిమాలకు కూడా అమ్మ రాజశేఖరే డైరెక్టర్.రణం బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ తరువాత దర్శకత్వం వహించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో అమ్మ రాజశేఖర్ కు దర్శకునిగా అవకాశాలు తగ్గాయి.

గత సీజన్ లో అమ్మ రాజశేఖర్ శిష్యుడు బాబా భాస్కర్ ప్రేక్షకులకు అందించిన ఎంటర్టైన్మెంట్ అంతాఇంతా కాదు.

అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.అమ్మ రాజశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో ప్రజలు కూడా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మరో సందర్భంలో జిమ్ ట్రైనర్ పై చేయి చేసుకుని అమ్మ రాజశేఖర్ వార్తల్లో నిలిచారు.

అయితే ఆయన భార్య, పిల్లలకు సంబంధించిన వివరాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు.

అమ్మ రాజశేఖర్ భార్య ప్రముఖ మోడల్.ఆమెపేరు జీవిత.

ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.తమిళనాట అమ్మ రాజశేఖర్ చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.

తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.

పలు రియాలిటీ షోలకు ఈయన జడ్జిగా వ్యవహరించారు.గత సీజన్ లో బాబా భాస్కర్ లా ఈ సీజన్ లో అమ్మ రాజశేఖర్ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుని టైటిల్ రేసులో నిలుస్తారేమో చూడాలి.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!