కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్లనన్న విష్ణుప్రియ.. ఇప్పుడు మాత్రం మాట మార్చిందిగా!
TeluguStop.com
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో ప్రేక్షకుల్లో, సెలబ్రిటీలలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
బిగ్ బాస్ షో కొంతమంది కెరీర్ కు ప్లస్ అయితే ఎక్కువమంది కెరీర్ కు మైనస్ అవుతోంది.
అయితే ఒకప్పుడు విష్ణుప్రియ( Vishnu Priya ) బిగ్ బాస్ షోలో పాల్గొననని చెప్పిన విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్8 లో మాత్రం పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు.
బిగ్ బాస్ కాన్సెప్ట్ నాకు నచ్చదని విష్ణుప్రియ గతంలో కామెంట్లు చేశారు.విష్ణుప్రియ గతంలో చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
గతంలో నాగార్జున( Nagarjuna ) సైతం ఇలాంటి కామెంట్లు చేసి తర్వాత రోజుల్లో ఈ షోకు హోస్ట్ గా పని చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
"""/" /
బిగ్ బాస్ షో సీజన్4 సమయంలో విష్ణుప్రియ ఈ కామెంట్లు చేయడం జరిగింది.
బిగ్ బాస్ షో లాంటి షోను నేను ఎంకరేజ్ చేయనని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఎలిమినేషన్ నాకు నచ్చదని విష్ణుప్రియ గతంలో చెప్పుకొచ్చారు.
డబ్బులు ఇస్తానని చెబితే ఈ షోకు ఎందుకు వెళ్తానని లక్షలు కాదు కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకు వెళ్లనని విష్ణుప్రియ వెల్లడించడం గమనార్హం.
"""/" /
పని ద్వారా నా స్టేటస్ పెరగాలని నేను ఎప్పుడూ అనుకోనని ఆమె తెలిపారు.
నా లక్ష్యం ఏంటంటే నేను నవ్వుతూ ఉండాలని నా చుట్టూ ఉన్నవాళ్లు సైతం నవ్వుతూ ఉండాలని విష్ణుప్రియ అన్నారు.
బిగ్ బాస్ షోలో 12వ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ అడుగుపెట్టారు.విష్ణుప్రియ కామెంట్ల విషయంలో బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఒకింత ఫైర్ అవుతున్నారు.
దూకుడు పెంచిన ఐటీ అధికారులు…దిల్ రాజుతో పాటు మైత్రి పై ఐటి దాడులు?