పల్లవి ప్రశాంత్ ని తన బానిసలాగా మార్చేసిన శివాజీ..యావర్ శివాజీ మాయ నుండి తప్పించుకుంటాడా?
TeluguStop.com
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం డేంజరస్ కంటెస్టెంట్ గా మారిపోయాడు శివాజీ.
హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఏమార్చి నీతి నిజాయితీ పేరుతో నక్క వినయం తో దెబ్బ తీసి గేమ్ తీరుని మొత్తం పాడు చేస్తున్నాడు.
కనీసం ఈయనని ఎదిరించి మాట్లాడే వారే లేరు, అయితే ఆయనకీ దాసోహం అవ్వాలి, లేకపోతే సైలెంట్ గా కూర్చోవాలి.
కంటెస్టెంట్స్ అలా వ్యవహరిస్తే పర్లేదు, కానీ ఏకంగా హోస్ట్ అక్కినేని నాగార్జున సైతం శివాజీ( Shivaji ) భజన చెయ్యడం, ఆయన చేసే తప్పులను బాగా కవర్ చెయ్యడం చూస్తుంటే ఇదంతా బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ కావాలని శివాజీ ని మోస్తుందని అర్థం అవుతుంది.
నిన్న జరిగిన ఎపిసోడ్ ని చూస్తే నాగార్జున శివాజీ ఏ రేంజ్ సహాయం చేస్తున్నాడో అందరికీ అర్థం అవుతాది.
శివాజీ ఆడుతున్న కన్నింగ్ గేమ్ ని ప్రశ్నించే అమర్ దీప్( Amardeep Chowdary ) మరియు గౌతమ్ వంటి కంటెస్టెంట్స్ నోర్లను కూడా వీకెండ్ ఎపిసోడ్స్ లో నొక్కేస్తున్నాడు నాగార్జున.
"""/" /
ఇకపోతే హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే పల్లవి ప్రశాంత్ అద్భుతమైన ఆటగాడు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అలాంటి ఆటగాడిని శివాజీ తన గ్రిప్ లో పెట్టుకోవడం లో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.
తనకి ఇష్టం లేని కంటెస్టెంట్స్ గురించి శివాజీ పల్లవి ప్రశాంత్, యావర్ మరియు భోలే వంటి కంటెస్టెంట్స్ కి నెగటివ్ మైండ్ సెట్ ని ఎక్కించడం.
వీళ్ళని తనకి ఇష్టం లేని వారిపై వ్యతిరేకంగా మారి ఫైట్ చేసేలా చెయ్యడం, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురిని తన బానిసలు లాగ వాడుకుంటున్నాడు శివాజీ.
గడిచిన రెండు వారాల్లో పల్లవి ప్రశాంత్ శివాజీ కోసమే నామినేషన్స్ చేసాడు.శివాజీ సోఫా లో కూర్చొని 24 గంటలు అమర్ దీప్ మరియు గౌతమ్ వంటి కంటెస్టెంట్స్ గురించి తప్పుగా మాట్లాడడం వంటివి ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా అమర్ దీప్ కి అయితే యావర్ ని శత్రువుని చెయ్యడం లో శివాజీ సక్సెస్ అయ్యాడు.
"""/" /
కానీ గత వారం శివాజీ అసలు రంగులను ప్రిన్స్ యావర్( Prince Yawar ) పసిగట్టాడు, మెల్లిగా శివాజీ షాడో నుండి పక్కకి జరిగి తన సొంత ఆట ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ పల్లవి ప్రశాంత్ మరియు భోలే శివాజీ షాడో నుండి బయటకి వచ్చే ఛాన్స్ అసలు కనిపించడం లేదని అంటున్నారు నెటిజెన్స్.
శివాజీ ఏది చెప్తే అది రైట్, ఏది చెప్తే అది తప్పు అనే మైండ్ సెట్ లోకి వచ్చేసారు వీళ్లిద్దరు.
భోలే అంటే అతనికి ఆట మీద ఆసక్తి లేదు, ఎదో కొన్ని రోజులు సరదాగా ఎంజాయ్ చేద్దామని బిగ్ బాస్ కి వచ్చాడు.
కానీ పల్లవి ప్రశాంత్ అద్భుతమైన ఆటగాడు, టాస్కులు వచ్చాయంటే పులిబిడ్డలాగా రెచ్చిపోతాడు ఈ రైతు బిడ్డ.
అలాంటి కంటెస్టెంట్ టైటిల్ కొడితే సామాన్యులకు వచ్చే కిక్ మామూలుది కాదు.కానీ ఇలా శివాజీ షాడో లో ఉంటే పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కొట్టడం కష్టం అని అంటున్నారు నెటిజెన్స్.
సాధ్యమైనంత తొందరగా శివాజీ మాయ నుండి బయటకి వస్తే బాగుంటుందని, పల్లవి ప్రశాంత్ విన్నర్ గా చూడాలని కోరుకుంటున్నారు నెటిజెన్స్.
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో మలయాళం స్టార్ హీరో నటిస్తున్నాడా..?