అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్ 4 సీజన్!

బిగ్ బాస్ సీజన్ 4.పూర్తయ్యి రెండు వారలు అవుతుంది.

కానీ ఇంకా దాని జ్ఞాపకాల్లోనే మునిగి తేలుతున్నారు బిగ్ బాస్ ప్రియులు.కరోనా కాలంలోనూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వచ్చిన ఈ బిగ్ బాస్ సీజన్ 4 అందరిని ఆకట్టుకుంది.

లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి కష్టాలు పడిన అందరికి ఈ షో మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యింది.

అంతే ఈ బిగ్ బాస్ సీజన్ 4 కి వచ్చిన వారు అంతా కూడా పాజిటివ్ గానే బయటకు వెళ్లారు తప్ప ఒక్కరు కూడా నెగటివ్ అవ్వలేదు.

ఇక అలాంటి షో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.అలానే డిసెంబర్ 20న పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా హీరో అభిజిత్‌ అవ్వగా.రన్నర్ గా అఖిల్ నిలిచారు.

ఇక మూడవ స్థానంలో సోహెల్ నిలిచాడు.మొదటి ఎపిసోడ్ నుంచి ఫినాలే ఎపిసోడ్ వరకు ఎంతో ఉత్కంఠంగా.

అద్భుతమైన టాస్కులతో.డ్యాన్సులతో షో ను సూపర్ హిట్ చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఎంత అద్భుతంగా షో చేసారో అంతే అద్భుతంగా షో సక్సెస్ అయ్యింది.

గతంలో ప్రసారం అయినా మూడు బిగ్ బాస్ సీజన్ ల కంటే అధికంగా.

కాదు కాదు.ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్స్‌ను మించి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది.

ఫినాలే ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేసిన సందడికి ఈ షో ఆ రేంజ్ సూపర్ హిట్ కొట్టింది.

రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ‌ను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా స్టార్‌ మా ప్రకటించింది.

ఈ విషయంపైనా స్పందించిన నాగార్జున సైతం తెలుగు ప్రేక్షకులకు ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా నాగార్జున ట్విట్ చేశాడు.

బ్రో ప్లాప్ విషయం లో సాయి ధరమ్ తేజ్ కి సంబంధం లేదా..?