బిగ్ బాస్ సోహైల్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. పక్కా మాసివ్ రోల్ లో

సీరియల్స్ లో కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే ఫేమ్ తెచ్చుకున్న నటుడు సోహైల్.

ఈ షో లో టాప్ 5లో ఒకరిగా నిలిచినా సోహైల్ ఫైనల్ కి వెళ్ళే అవకాశం ఉన్న డబ్బులు తీసుకొని డ్రాప్ అయిపోయాడు.

అయినా కాని యాక్టర్ గా మంచి ఫేం వచ్చింది.బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ని ఈ యువ నటుడు రెండు చేతులా ఉపయోగించుకొని హీరోగా నిలబడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

వచ్చిన తర్వాత అనుకున్నట్లుగానే జార్జ్ రెడ్డి తెరకెక్కించిన నిర్మాతలు సోహైల్ తో సినిమాని ఎనౌన్స్ చేశారు.

అయితే తరువాత కొద్ది రోజుల పాటు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

అయితే సడెన్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇందులో పక్కా మాస్ లుక్ లో సోహైల్ కనిపిస్తున్నాడు.అలాగే ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది.

అప్పిరెడ్డి ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సరికొత్త పాయింట్ నేపధ్యంలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత అప్పిరెడ్డి తెలిపారు.

ఇక ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇందులో ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.