బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతో పాటు ఆమె కూడా ఎలిమినేట్ అవుతారా?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8( Bigg Boss Telugu 8 ) సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.

చూస్తుండగానే ఇప్పుడే పదో వారం ముగింపు దశకు చేరుకుంది.నేడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళనున్నారు.

కాగా వారాలు గడిచే కొద్దీ బిగ్ బాస్ హౌస్ లో జనాలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారు.

పోను పోను బిగ్ బాస్ హౌస్ వారాలు మరింత కఠినంగా ఉండనున్న విషయం తెలిసిందే.

"""/" / ఇక ఈ వారం నిఖిల్‌, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతమ్‌ కృష్ణ, పృథ్వీ, హరితేజ నామినేషన్స్‌ లో ఉన్నారు.

వీరిలో నిఖిల్‌, విష్ణు, గౌతమ్‌ ల గురించి ఆలోచించాల్సిన పని లేదు.వారికి ఓట్లు గట్టిగానే పడుతున్నాయి.

ప్రేరణ( Prerana ) ఓటు బ్యాంక్‌ కూడా బాగానే పెరిగింది.అయితే ఇప్పుడు మిగిలిందల్లా పృథ్వీ, యష్మి, హరితేజ.

ఈ ముగ్గురిలో ఎవరు సేఫ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.

అయితే హరితేజ( Hari Teja ) ఎలిమినేషన్‌ కే ఎక్కువ ఆస్కారం ఉందని తెలుస్తోంది.

"""/" / లేదు అనుకుంటే పృథ్వీ,( Prithvi ) యష్మిని( Yashmi ) బలి చేసే ఛాన్స్‌ ఉంది.

కానీ బిగ్‌బాస్‌ భలే ట్విస్ట్‌ ఇచ్చాడు.వీళ్లందరినీ కాదని ఏకంగా గంగవ్వను( Gangavva ) పంపించేశాడు.

ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో తనను బయటకు పంపించక తప్పలేదు.దీంతో నామినేషన్స్‌ లో ఉన్న మిగతా వాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు.

కానీ అంతలోనే బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు.ఎలిమినేషన్‌ ఇంకా పూర్తవలేదంటూ హరితేజను పంపించేశారు.

అలా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ వల్ల గంగవ్వ, హరితేజ ఎలిమినేట్‌ అయ్యారు.

కెనడాలో భారతీయ విద్యార్థుల నిజ స్వరూపం ఇదేనా.. వీడియో వైరల్!