Pallavi Prashanth: బయట అన్నం పడేశావ్.. బిగ్ బాస్ లో ఎంగిలి మెతుకులు తింటావ్.. పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) కూడా ఒకటి.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) మొదలవగా అందులోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు పల్లవి ప్రశాంత్.

కామన్ మ్యాన్ రైతుబిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే పల్లవి ప్రశాంత్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు వాళ్ళు కూడా అతను ఎవరు అన్నది చాలామందికి తెలియదు.

కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకున్నాడు.

బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లి ఎలా అయినా గెలుస్తాను. """/" / రైతు పడే కష్టాలు చెబుతాను అంటూ వాగ్దానాలు చేసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హీరోయిన్ రతికతో( Heroine Rathika ) పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

మరోవైపు టాస్కులో మాత్రం తగ్గేదేలే అన్న లెవల్‌లో ఆడుతూ తాను అందరికీ టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు.

తాజాగా అతడు హౌస్‌లో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది.హౌస్‌లో ఎవరో తిన్నప్పుడు కింద మెతుకులు పడటం గమనించాడు ప్రశాంత్‌.

అది చూసిన అతడు ఎవరూ లేనప్పుడు అక్కడికి వెళ్లి ఆ రెండు,మూడు ఎంగిలి మెతుకులు ఏరి కెమెరాలకు చూపిస్తూ తిన్నాడు.

అన్నం( Food ) పడేస్తే తాను తట్టుకోలేనట్లుగా ప్రవర్తించాడు. """/" / అయితే ఇది కొంచెం ఓవర్‌గా ఉందని జనాలు అనుకున్నారు అంతే అంతలోనే సోషల్‌ మీడియాలో మరో వీడియో ప్రత్యక్షమైంది.

ఇక్కడ ప్రశాంత్‌ తన ప్లేటులో తినగా మిగిలిపోయిన కూరను, కొంత అన్నాన్ని చెత్తబుట్టలో పడేశాడు.

ఇది చూసిన జనాలు అవాక్కయ్యారు.అన్నం పడేయొద్దంటూ హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావు, బయటేమో నీ ప్లేటులోని అన్నం మెతులకు చెత్తలో పడేశావు ఇంత ఓవరాక్టింగ్‌ అవసరమా అంటూ ప్రశాంత్ ని తిట్టి పోస్తున్నారు.