Prince Yawar: ప్రిన్స్ యావర్ జీవితంలో ఇంత విషాదం ఉందా.. అతనికి అమ్మ ప్రేమ తెలియదంటూ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో( Bigg Boss ) ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది.

పదవ వారము కంటెస్టెంట్లకు సంబంధించిన ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటికే శివాజీ కొడుకు, అమర్ దీప్ భార్య, గౌతమ్ కృష్ణ తల్లి, ప్రశాంత్ తండ్రి లాంటి వారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఈవారం మొత్తం కూడా ఎమోషనల్ డ్రామా నడుస్తోంది.రెండు నెలలకు పైగా ఇంటికి దూరమైన కంటెస్టెంట్స్ లో జోష్ నింపేందుకు ఫ్యామిలీ వీక్( Family Week ) ఏర్పాటు చేశారు.

హౌస్ మేట్స్ ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా వస్తున్నారు. """/" / కాగా తాజాగా శోభా శెట్టి తల్లి, అమర్ దీప్ భార్య వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే యావర్ అన్నయ్య( Yawar Brother ) కూడా వచ్చాడు.మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ మూస్తూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టాడు.

యావూ.మేర బచ్చా! అని మైక్ లో వినిపించగా యావర్( Yawar ) ముఖంలో వెయ్యి దీపాలు వెలిగాయి.

డోర్ దక్కరకు పరుగెత్తుకెళ్లాడు.అక్కడ అన్నయ్య లేడు.

ఇంట్లో నుండే యావర్ అన్నయ్య సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.ఇద్దరూ గట్టిగా హత్తుకున్నారు.

హౌస్ మేట్స్ ని పలకరించేందుకు యావర్ అన్నయ్య రెండు తెలుగు పదాలు నేర్చుకున్నాడు.

అనంతరం గౌతమ్ కి( Gautam ) కృతజ్ఞతలు చెప్పాడు.గౌతమ్ తల్లి యావర్ ని అక్కున చేర్చుకుని నీకు కూడా నేను అమ్మనే అన్నారు.

"""/" / అందుకే గౌతమ్ కి యావర్ అన్నయ్య థాంక్స్ చెప్పాడు.వీడికి అమ్మ ప్రేమ అంటే తెలియదు.

అమ్మ లేదు అని ఆయన కూడా ఏడ్చేశాడు.అన్నదమ్ములు తల్లిని తలచుకుని ఏడవడం గుండెలు బరువెక్కేలా చేసింది.

అది చూసిన శివాజీ( Sivaji ) పక్కనే ఉండి వాళ్ళను ఓదార్చారు.అంతేకాకుండా అన్నదమ్ములు ఇద్దరు ఏడవటం ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది.

అనంతరం తమ్ముడు యావర్ ని అన్నయ్య మోటివేట్ చేశాడు.నువ్వు ఫైటర్ వి.

పోరాడి కప్పు గెల్చుకుని రా.అందరూ నువ్వు నువ్వు తెచ్చే కప్పు కోసం ఎదురుచూస్తున్నారు.

అని చెప్పాడు.అనంతరం ఇంటిని వీడాడు.

నాన్నను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం….నారా బ్రాహ్మణి కామెంట్స్ వైరల్!