బిగ్ బాస్ హౌస్ లో కార్తీకదీపం హిమకు ప్రమాదం.. భయపడిన హౌస్ మేట్స్!

బిగ్ బాస్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 6 షో ఇటీవలే మొదలై అప్పుడే మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారంలోకి అడుగు పెట్టింది.

అయితే మొదటి వారం హౌస్ లో పెద్దగా గొడవలు ఏమీ లేకపోయినప్పటికీ రెండవ వారం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వారం మొదటి లోనుంచి గొడవలు, అరుపులు, ఏడుపులతో రసవతారంగా సాగుతోంది.

కంటెస్టెంట్లు ఎవరికి వారు గట్టిగానే పోటీ ఇస్తూ బాగానే ఆడుతున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఉండడం అన్నది సహజం.

ఈ టాస్కుల సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ లో పాల్గొనే సమయంలో లేడీ కంటెస్టెంట్ లు కూడా వారి శక్తికి మించి పోరాడుతూ అప్పుడప్పుడు గాయాల పాలవుతూ కూడా ఉంటారు.

ఇక తాజాగా జరిగిన సిసింద్రీ టాస్క్ లో కూడా అటువంటి ప్రమాదమే జరిగింది.

కీర్తి సిసింద్రీ టాస్క్ లో భాగంగా గాయాల పాలయ్యింది.రెండో కంటెడర్ గా నిలవడానికి ఫిజికల్ టాస్క్ లో గెలవాలని చాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో ఆరోహి, ఫైమా ఇద్దరు డిస్ క్వాలిఫై అయ్యారు.తర్వాత ఇనయా సుల్తానా, కీర్తి మాత్రమే గెలవడానికి సిద్ధమయ్యారు.

"""/"/ ఇక ఈ టాస్క్ లో కీర్తితో బాగా గట్టిగానే పోరాడింది ఇనయా.

టాస్క్ లో ఒకరిని ఒకరు తెలుసుకునే క్రమంలోనే కీర్తి కి ఒక్కసారిగా పొట్ట మజిల్ పట్టుకోవడంతో నొప్పితో చాలా ఇబ్బంది పడింది.

ఇక అక్కడే కూర్చుండిపోయి శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది.కీర్తి కి అసలు ఏమయిందో అని అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.

ఆ తర్వాత ఆమె మెల్లగా విశ్రాంతి తీసుకుని ఊపిరి తీసుకోగానే సెట్ అయింది.

ఇక చివరికి ఆ టాస్క్ లో ఇనయా బిగ్బాస్ ప్రకటించారు.

రాజమౌళి భార్య దగ్గర అప్పు చేసిన స్టార్ డైరెక్టర్.. ఆ అప్పు ఇప్పటికీ తీర్చలేదా?