బాలాదిత్యపై భార్య వైరల్ కామెంట్స్.. అందరి ముందు అలా చెప్పడం ఏంటంటూ?

బాలాదిత్య.బిగ్ బాస్ హౌస్ లో అతి మంచితనం, అతి మర్యాదగా ప్రవర్తిస్తూ స్వీట్ అండ్ సాఫ్ట్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో మంచితనంగా ఉంటూ చివరి వరకు నిలవాలి అని అనుకున్నట్లు ఉన్నాడు మన బాలాదిత్య.

కానీ ఆ మంచితనమే అతనికి శత్రువుగా మారింది.ఎందుకంటే అతడు నిజంగానే మంచితనంగా ఉన్నాడా?లేకపోతే అలా నటిస్తున్నాడా?సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అన్నది ప్రేక్షకులకు అర్థం కాక అతనిపై ఫేక్ కంటెస్టెంట్ అనే ముద్రను కూడా వేస్తున్నారు.

అయితే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా కూడా బాలాదిత్య ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.

మొదట్లో ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో భాగంగా బాలాదిత్య బిగ్బాస్ ఆదేశాల మేరకు తన సిగరెట్లు త్యాగం చేసిన విషయం తెలిసిందే.

అయితే బాలాదిత్య త్యాగం చేశాడు అనడం కంటే త్యాగం చేసేలా చేసింది గీతు అని చెప్పవచ్చు.

బిగ్బాస్ గీతూ ను పిలిచి బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలంటే ఇంటి సభ్యులు చక్కెర త్యాగం చేయాలి లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి అని తెలిపాడు బిగ్ బాస్.

ఇప్పుడు గీతు హౌస్ లో అందరి ముందు గట్టిగా అరిచి చెప్పడంతో అది బాలాదిత్యకు నచ్చలేదు.

బిగ్ బాస్ ఆదేశాలు ప్రకారం బాలాదిత్య వచ్చి పొగ తాగడాన్ని వదిలేశాడు. """/"/ కానీ ఇప్పటికీ కెమెరాల ముందుకు వచ్చి సిగరెట్లు పంపించమని బతిమిలాడుతూనే ఉన్నాడు.

కానీ బిగ్ బాస్ మాత్రం బాలాదిత్య కు సిగరెట్లు ఇవ్వకుండా మరింత ఏడిపిస్తున్నాడు.

కాగా తాజాగా ఈ వ్యవహారం పై బాలాదిత్య భార్య మానస స్పందించింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాలాదిత్య సిగరెట్లు తాగడం మానేయాలనుకుంటే మానేయగలడు.

బాలాదిత్య హనుమాన్‌ మాల వేసుకున్నప్పుడు 40 రోజులు ఒక్క సిగరెట్‌ ముట్టుకోలేదు.కానీ గీతూ అందరి ఎదుట సిగరెట్‌ మానేయాలని చెప్పడం బాగోలేదు.

అది బాలాదిత్య వీక్‌నెస్‌ అని తెలిసి కూడా తనతో ర్యాపో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి ఆయనకే చెప్తే బాగుండదని బాలాదిత్య అనుకున్నాడు.

అతడితో స్మోకింగ్‌ మానిపించాలన్నదే గీతూ ఉద్దేశ్యం.దాన్ని నేను తప్పుపట్టను అని తెలిపింది గీతూ.

సస్పెన్స్‌కు తెరదించిన ట్రంప్ .. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా జేడీ వాన్స్