మా అమ్మ బతికుంటే బాగుండేదాంటు కన్నీళ్లు పెట్టిన శ్వేతా?
TeluguStop.com
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బీబీ ఫ్యాక్టరీ నుంచి బొమ్మలు తయారు చేయాలని చెప్పడంతో రవి టీం సభ్యులు బిగ్ బాస్ పిల్లో నుంచి దూది తీసే బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించడంతో బిగ్ బాస్ వారికి పనిష్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రవి శ్వేత లోబోలకు తన ఐడియా చెప్పి వారితో ఈ పని చేయించారు.
ఈ క్రమంలోనే రవి చేసిన పనికి శ్వేతకు పనిష్మెంట్ అయింది.ఇక ఎప్పుడు మాదిరిగానే బిగ్ బాస్ హౌస్ లో వరెస్ట్ ఫర్ ఫార్మర్ గా శ్వేత ఎంపిక కావడంతో తనకు జైలు శిక్ష పడింది.
రవి చేసిన పనికి వరెస్ట్ ఫర్ ఫార్మర్ గా శ్వేత జైలు కెళ్ళింది.
జైలుకు వెళ్ళిన శ్వేత రవి చేసిన పనికి తాను శిక్ష అనుభవిస్తున్నాను అంటూ శ్వేత అనీ మాస్టర్ కి చెప్పుకొని ఏడ్చింది.
ఇలా శ్వేత తో పాటు అనీ మాస్టర్ శ్వేతను ఓదారుస్తూ నిద్రపోకుండా శ్వేత దగ్గరే ఉండిపోయింది.
"""/"/
ఇక షణ్ముక్ శ్వేతకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో వివరించాడు.
తాను తప్పు చేయకుండా మీతో చేయించాడని చెప్పారు.ఇక శ్వేత అనీ మాస్టర్ కు మధ్య జరిగిన గొడవ గురించి షణ్ముఖ్ వివరిస్తూ అందులో మీ తప్పు లేదని అనీ మాస్టర్ తనకు ఏ రిలేషన్స్ వద్దు అంటూ నోరు జారిందని చెప్పడంతో శ్వేత కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుని మా అమ్మ బ్రతికి ఉంటే ఎంతో బాగుండేది అంటూ ఎక్కి ఎక్కి ఏడ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ?