రవి డేంజర్.. అతనికి దూరంగా ఉండండి!

బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం ఆరు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.

19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ కార్యక్రమం ఆరు వారాలకు గానీ ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఈ వారం శ్వేత వర్మ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

హౌస్ నుంచి శ్వేత వర్మ ఎలిమినేట్ కావడంతో ఈమె హౌస్ సభ్యులకు వీడ్కోలు పలుకుతూ స్టేజ్ పైకి వచ్చింది.

ఇలా బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన శ్వేత వర్మతో హోస్ట్ నాగార్జున సైన్ గేమ్ ఆడించారు.

ఈ క్రమంలోనే శ్వేతా వర్మ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ రవి చాలా స్మార్ట్ అని కానీ అతడికి దూరంగా ఉండటం మంచిదని తెలిపింది.

అదేవిధంగా అని మాస్టర్ తక్కువ మాట్లాడుతూ గేమ్ ఆడాలని సూచించింది. """/"/ అయితే గతవారంలో నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి శ్వేతా వర్మ బీబీ ఫ్యాక్టరీ నుంచి బొమ్మల తయారీ టాస్క్ లో భాగంగా రవి టీంలో ఉంది.

రవి చేసిన పనికి శ్వేతా వర్మకు శిక్ష పడటం ఆమె వరెస్ట్ పర్ఫార్మర్ గా జైలుకు వెళ్లడంతో ఆమెపై ఎక్కువగా నెగిటివిటీ ఏర్పడిందని అందుకోసమే తనకు ఓట్లు తక్కువ పడటం వల్ల తాను ఎలిమినేషన్ కు గురి అయిందని తెలుస్తోంది.

ఇలా రవి చేసిన పనికి శిక్ష అనుభవించిన శ్వేతా వర్మ రవికి దూరంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన