దీప్తి సునయనకు ఆ విషయం చెప్పేస్తానన్న ప్రియా.. దండం పెట్టిన షన్ను?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ ప్రియ ఎలిమినేట్ అయింది.ఇక ఈ వారం జరిగిన ఎలిమినేట్ అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది.

ప్రియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఆమె సన్నితో పెట్టుకున్న గొడవే.

ఈ క్రమంలోనే సన్నీని ఆమె చెంప పగలగొడతా అని తిట్టడం, సన్నీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు.

దీనితో గత రెండు రోజులుగా ఆమెకు ఓట్లు తక్కువగా వచ్చాయి.అయితే ఇంకా కొద్ది రోజులుగా హౌస్ లో కొనసాగాల్సిన ప్రియా అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చేసింది.

ఎలిమినేషన్ అనంతరం స్టేజి మీదకు వచ్చిన ప్రియ తో నాగార్జున గేమ్ ఆడించాడు.

హౌస్ మేట్స్ కు రిపోర్ట్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు.మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ అతడు నాకు అర్థం కాడంటూ 5 మార్కులు ఇచ్చింది.

ఎవరు హర్ట్ అవ్వకుండా నువ్వు హర్ట్ కాకుండా గేమ్ ఆడు అంటూ విశ్వా కు ఐదు మార్కులు ఇచ్చింది.

"""/" / అనంతరం బాగా ఆడుతున్నాడు అంటూ రవి కి ఏడు మార్కులు వేసింది.

ఇక ఆ తరువాత షణ్ముఖ్ ఎనిమిదిన్నర మార్కులు వేస్తూ ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని తెలిపింది.

షణ్ముఖ్ జస్వంత్ వండర్ ఫుల్ పర్సన్ అతను బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు అని అతడిని ఆకాశానికి ఎత్తేసింది.

షణ్ముఖ్ జస్వంత్ నీ గర్ల్ ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా అని అడగగా.

ఆ మాట చాలంటూ సంతోషించాడు షణ్ముఖ్.అప్పుడు ప్రియా దీప్తి మర్చిపోయి హాయిగా ఉంటుందని ఆమెకు చెప్తాననీ అనడంతో వణికిపోయాడు షణ్ముఖ్.

అలా చెప్పొద్దని దండం పెట్టేశాడు.మా ఇంట్లో కూడా భయపడను కానీ ఆ అమ్మాయికి భయపడతాను అని అన్నాడు.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!