లగ్జరీ కారు కొన్న శివజ్యోతి.. అతి చేష్టలు అంటూ నెట్టింట్లో ట్రోల్!

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి ఈ కార్యక్రమం తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుందని చెప్పాలి.

ఒకప్పుడు న్యూస్ రీడర్ గా పనిచేసిన శివ జ్యోతి ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అదే విధంగా ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నారు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో శివ జ్యోతి బుల్లితెర కార్యక్రమాలపై సందడి చేస్తూ కాస్త ఓవర్ చేస్తున్నారనే చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈమె తన పాత కారుకు గుడ్ బై చెబుతూ.కొత్త కారును కొన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈమె ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశారు.అయితే ఈ కారు గత ఏడాది కొన్నప్పటికీ ఈ కారుకు సంబంధించిన వీడియోని గతంలోనే ఒకసారి అభిమానులతో పంచుకున్నప్పటికీ తిరిగి ఈ వీడియోని అప్లోడ్ చేశారు.

ఇలా పాత కారుతో కొత్త వీడియో ద్వారా మరోసారి జ్యోతక్క తన కారుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

"""/" / ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.చూపీయాల.

చూపీయాల.అగో బట్టలేసుకుందిగా.

అదే నా కారు అంటూ జ్యోతి తన కొత్త లగ్జరీ కారును చూపించారు.

ఇక ఈ కారు EMI లో కొన్నామని, ఆ EMI తన భర్త కడతారంటూ తనని చూపించారు.

ఇక ఈ కారు కొన్న సమయంలో తన భర్తతో పాటు నటుడు రవి కృష్ణ కూడా ఉన్నారు.

ఇకపోతే షోరూమ్ వ్యక్తితో కూడా ఇది EMI లో కొన్నామని చెప్పండి లేదంటే వాళ్ళు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అని అనుకుంటారు అంటూ అతనితో కూడా చెప్పించారు.

ఇలా తను కారు కొన్న పాత వీడియోని తిరిగి ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా దారుణమైన కామెంట్లని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ మధ్యకాలంలో శివజ్యోతి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏడుస్తూ కన్నీటి వరద పారేస్తుంది.

అలా తరచూ చేయడం వల్ల చాలా మంది శివ జ్యోతి ఓవర్ చేస్తుందని, ఈమె అతి చేష్టలు పరాకాష్టకు చేరుకున్నాయి అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాత్రిపూట అలాంటి సినిమాలు చూస్తారా… ఇలాంటి అలవాటు కూడా ఉందా?