ఈసారి కొత్తదనం కోసం బిగ్ బాస్ ఇలా ట్రై చేశాడా? అంతా మెంటల్ ఉన్నారు?

బిగ్ బాస్ షో ( Bigg Boss Show )గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

నేడు బుల్లితెర షోలలో ఎక్కువగా TRP సాధించింది ఈ షోనే.అందుకే ఈ షో విషయంలో సీజన్ సీజన్ కి కూడా ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తున్నారు నిర్వాహకులు.

ఇక అసలు విషయంలోకి వెళితే, ప్రస్తుత షోలో కొందరు కంటిస్టెంట్స్ చిత్ర విచిత్రంగా బిహేవ్ చేయడం మనం గమనించవచ్చు.

అయితే అది బిగ్ బాస్ గేమ్ ప్లాన్ లో భాగం అయినప్పటికీ, చూడడానికి ఒకింత ఉబ్బెట్టుగా అనిపించకమానదు.

మరీ ముఖ్యంగా కంటిస్టెంట్ నాగమణికంఠ ( Nagamanikantha )గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి.మణికంఠ సింపతీ కార్డు బాగానే ప్లే చేస్తున్నాడు కానీ అది చూసేవాళ్ల దగ్గరనుండి తోటి కంటిస్టెంట్లకు కూడా చిరాకు తెప్పిస్తుందని చాలా క్లియర్ గా అర్ధం అయిపోతుంది.

"""/" / తాజాగా హౌస్ లో గేమ్ ఆడుతూ ఆడుతూ కింద పడిపోయాడు.

దాంతో తోటి టీమ్ మేట్స్ ఏమైందో తెలియక షాక్ తింటూ ఉండగానే, తరువాత కొంతసేపటికి మళ్లీ వచ్చి, నేను ఆడతాను అని చిన్న పిల్లాడి లెక్క మారాం చేసాడు.

దాంతో అతని చిత్రమైన ప్రవర్తనకి తోటి టీమ్ మేట్స్ కి పిచ్చి లేస్తుంది.

అయితే మణికంఠకే ప్రేక్షకదేవుళ్లు ఎక్కువ వోట్లు వేస్తూ తను ఖచ్చితంగా హౌజులో ఉండాల్సిందేనని, బిగ్‌బాస్ కంప్యూటర్లు స్టక్కయిపోయే రేంజులో సపోర్ట్ చేస్తున్నారు మరి! హౌజులోకి వచ్చింది మొదలు, మణికంఠ మెంటల్ గేమ్ ఆడి తోటివారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

ఓ మూలన నక్కి దాక్కోవడం, భయపడడం వంటివి చేస్తూ ఉంటాడు.ఈ క్రమంలో తోటి కంటిస్టెంట్ అభయ్( Abhay ) వెళ్లి సముదాయించబోతే… నీను ఆడాలి, లేకపోతే నా పెళ్లాంపిల్లలు నా దగ్గరకు రారు, నేను గెలిస్తేనే నా సంసారం నిలబడతది అని ఎమోషనల్ డైలాగ్స్ పేల్చుతాడు.

"""/" / ప్రేరణతో దోసెల విషయంలో గొడవపడ్డాడు, దాంతో.ఆమె, "చిన్న విషయాన్ని పీకి పీకి పెంట చేశావ్, ఎహె, నువ్వు మాట్లాడుకు పోరా!" అని దులిపేసింది.

ఇక యష్మి విషయంలో కూడా అంతే.ఊరికే ఆమెని వాటేసుకుంటాడు.

బాగా అన్‌కంఫర్ట్‌గా ఉందని ఆమె బిగ్‌బాస్‌కు చెప్పి ఏడ్చినా కూడా వదలదు.ప్రస్తుతం ఇలాంటి దిక్కుమాలిన వినోదమే బిగ్‌బాస్ హౌస్ లోపల నడుస్తోంది మరి! ఈ నేపథ్యంలోనే "ఒరేయ్, నా దగ్గరకు రాకురా, నిన్ను కారణం ఉన్న లేకపోయినా కూడా ప్రతివారం నామినేట్ చేస్తాను," అని యష్మి ఖండితంగా చెప్పేసినా మణికంఠ తీరులో మార్పు రాలేదు.

ఆ విషయానికొస్తే అందరూ అంతేలా కనిపిస్తోంది.పృథ్వికేమో హగ్గుల యావ, యష్మి అరుపులు గురించి సరేసరి, ఇక రఫ్‌గా పైపైన పరిశీలిస్తే నైనిక అనే అమ్మాయే కాస్త కూల్‌గా ఆడుతున్నట్టు కనబడుతోంది.

మరి ఇలాంటి షోలు ఆమేర రేటింగులు సంపాదించాలంటే ఇలాంటివన్నీ ఉండాల్సిందేమో మరి!.

ముద్దిస్తావా అన్నాడు.. ఆ వ్యక్తి ప్రవర్తనతో భయం.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!