అమ్మ వైద్యం కోసం నెలకు రూ.లక్ష ఖర్చవుతోంది.. శ్రీసత్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య( Sri Satya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
బిగ్ బాస్ షో తో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి.
చాలామంది హీరోయిన్ లకు టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేక అవకాశాలు రాక వెనకబడ్డారు.
శ్రీ సత్యకు కూడా అదృష్టం లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ గ్లామర్ ఉన్న కూడా బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్య కు మంచి ఆఫర్స్ రావడం లేదు.
"""/" /
ఒకవేళ చిన్నచిన్న సినిమా ఆఫర్లు వచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక పంచుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ సత్య మాట్లాడుతూ.జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని.
నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు.తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్ ఎవరు ఇవ్వరు.
కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే.కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరంతే.
మమ్మీ( Sri Satya Mother ) ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.ఆమెకు నెలకు రూ.
లక్షకు పైగా ఖర్చవుతుంది. """/" /
కారు కొనడానికి నా వద్ద డబ్బుల్లేవు.
2019లో ఒక చిన్న కారు కొన్నాను.అది పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేశాను.
ఇప్పటికీ నా వద్ద కారు లేదు.ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆస్పత్రి ఖర్చులకే సరిపోతాయి అని చెబుతూ ఎమోషనల్ అయింది.
ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.