అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.. శ్రీరామ చంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
TeluguStop.com
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 షో ముగిసింది.
బిగ్ బాస్ టైటిల్ ని సన్నీ గెలుచుకున్నాడు.మొదటి స్థానంలో విన్నర్ గా సన్నీ, రెండో స్థానంలో రన్నరప్ గా షణ్ముఖ్ జశ్వంత్, మూడవ స్థానంలో సింగర్ శ్రీరామ్ చంద్ర నిలిచాడు.
బిగ్ బాస్ హౌస్ లో తన మాట తీరుతో,తన పాటలతో, తన ఆటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
ఇక శ్రీరామచంద్ర అభిమానులు అతడు బిగ్ బాస్ హౌస్ టైటిల్ ని గెలుస్తాడని భావించారు.
కానీ బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకడిగా నిలిచి, మళ్లీ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు.
ఇక బిగ్ బాస్ షో ముగిసిన తరువాత పాల్గొన్న శ్రీ రామ్.తన పెళ్లి గురించి, తనకు కాబోయే భార్యకు లక్షణాల గురించి ఓపెన్ అయ్యాడు.
ఈ సందర్భంగా శ్రీ రామ్ చంద్ర మాట్లాడుతూ.గత మూడేళ్లుగా పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తున్నారని, ఈ ఏడాది కానీ లేకపోతే వచ్చే ఏడాది కానీ తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.
ఇకపోతే అమ్మాయి విషయానికి వస్తే ఎలాంటి అమ్మాయి కావాలి అన్నదానిపై పెద్దగా సెలక్షన్స్ ఏమీ లేవని.
కానీ అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. """/" /
అలాగే ఫ్యామిలీ కి, బంధాలకు విలువ ఇచ్చే అమ్మాయి అయి ఉండాలి.
అదే విధంగా నన్ను బాగా ప్రేమించాలి.అంటూ తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పకనే చెప్పేశారు శ్రీరామ్.
బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇవ్వక ముందు శ్రీరామచంద్ర కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
బిగ్ బాస్ తర్వాత శ్రీ రామ్ చంద్ర కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు: అల్లు అర్జున్