ట్రోల్ అవుతున్న సిరి.. ఈ వారం బయటకు వచ్చేస్తావ్ అంటూ?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 5 గత రెండు వారాలుగా ప్రసారం అవుతూ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే మొదటి వారం హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ కాగా.రెండవ వారం హౌస్ నుంచి ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు.

గత రెండు వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో టాస్క్ లు.

గొడవలు.పోట్లాటలు జరిగాయి.

ఒకరిపై ఒకరు అరె చుకోవడం, చివరికి కొట్టుకొనే వరకు కూడా వచ్చారు.ఇలా పోటీ పడుతూ కంటెస్టెంట్ లందరూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పవచ్చు.

అయితే గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిరి హనుమంత్ కంటెస్టెంట్ సన్నీ పై ఎన్నో ఆరోపణలు చేశారు.

ఓ టాస్క్ లో భాగంగా దాచిపెట్టిన పిల్లోస్ తీసుకోవాలంటూ బిగ్ బాస్ చెప్పినప్పుడు.

సిరి తన షర్ట్ లోపల పిల్లో ఉంచుకోవడం వల్ల.దానిని తీసుకోవడం కోసం సన్నీ తన షర్టు లోపలకి చెయ్యి పెట్టాడంటూ సన్నీ పై విమర్శలు చేసింది.

అయితే సన్నీ తను చెయ్యి పెట్టలేదని తేల్చి చెప్పాడు.ఈ క్రమంలోనే శనివారం హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున ఈ విషయం గురించి కంటెస్టెంట్ లను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ఆ సమయంలో జరిగినటువంటి వీడియోను స్లో మోషన్ లో చూడగా సన్నీ చెయ్యి పెట్టలేదని అర్థమయింది.

ఇలా లేనిపోని అబద్ధాలు చెబుతూ అబాండాలు వేయడం మంచిది కాదు అంటూ ఆమెకు నాగార్జున వార్నింగ్ ఇచ్చారు.

"""/"/ ఇలా హౌస్ లో సిరి తమ అభిమాన నటుడు సన్నీ పై లేనిపోని ఆరోపణలు వేస్తూ పూర్తిగా నెగిటివిటీ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు అభిమానులు.

ఈ క్రమంలోనే సన్నీ అభిమానులు సిరిని ట్రోలింగ్ చేస్తున్నారు.సన్నీ పై లేనిపోని ఆరోపణలు చేయడంతో హర్ట్ అయిన అతని ఫ్యాన్స్ ఎలాగైనా తనని హౌస్ నుంచి బయటకు పంపించాలని కంకణం కట్టుకున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆమె గురించి ట్రోలింగ్ చేస్తూ.సిరి కచ్చితంగా ఈ వారం బయటకు వచ్చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సిరి తనకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ప్రమాదంలోకి పడినట్లయింది.సన్నీ పై నెగిటివిటీని తీసుకురావాలని భావించిన సిరికి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివిటీ రావడంతో ఈమె హౌస్ లో ఎక్కువ రోజులు ఉండదని తెలుస్తోంది.

ప్రతిరోజు ఇలా స్నానం చేస్తే.. ఇంట్లోకి దుష్టశక్తులు రావడం ఖాయం..!