Siri Hanmanth: మోడ్రన్ డ్రెస్సులలో కిరాక్ ఫోటోలకు ఫోజులిచ్చిన సిరి… నీ డ్రెస్సులు అలానే ఉన్నాయంటూ కామెంట్స్?
TeluguStop.com
యూట్యూబర్ గా ఎన్నో వీడియోలను చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి హనుమంత్(Siri Hanmanth) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈమె యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటించే అవకాశాలను సొంతం చేసుకున్నటువంటి ఈమె బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలోకి కూడా అడుగుపెట్టారు.
బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా పూర్తిస్థాయిలో నెగిటివిటీ సొంతం చేసుకున్నటువంటి సిరి బయటకు వచ్చిన తర్వాత యథావిధిగా తన పనులలో బిజీ అయ్యారు.
"""/" /
ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా( Anchor ) వ్యవహరించడమే కాకుండా మరోవైపు సినిమా అవకాశాలను అందుకొని సినిమాలలో కూడా నటిస్తున్నారు తాజా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో( Jawan Movie ) కూడా ఈమె అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సిరి ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి( Jabardasth ) యాంకర్ గా కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
తాజాగా మోడ్రన్ డ్రస్సులో గ్లామరస్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"""/" /
ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
చాలా సూపర్ స్టైలిష్ గా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇదివరకు ఉన్నటువంటి జబర్దస్త్ యాంకర్లకు( Jabardasth Anchor ) ఏమాత్రం తీసిపోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి కొందరు అయితే ఏకంగా మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్న ఎందుకో నాకు డోర్ కర్టన్ లాగే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
"""/" /
ఇలా సిరి డ్రెస్సులు అన్నీ కూడా డోర్ కర్టన్లను పోలి ఉంటాయి అంటూ నెటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే శ్రీహన్( Srihaan ) అనే మరో యూట్యూబర్ కూడా ప్రేమిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అయితే ప్రస్తుతం ఈమె కెరియర్ పరంగా పూర్తి ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
ఇక ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగడంతో తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్న అభిమానులు.. అలా జరగడం సాధ్యమా?