జవాన్ టీమ్ నుంచి ఫోన్ వస్తే ఫ్రాంక్ అనుకున్న… ఆ క్షణం ఎంతో ఏడ్చేసాను: సిరి హనుమంత్
TeluguStop.com
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee ) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నయనతార ( Nayanatara ) ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం జవాన్( Jawan ).
ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్( Siri Hanumanth ) కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమాలో తెరపై ఈమెను చూసినటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
షారుక్ ఖాన్ సినిమాలో సిరి హనుమంతు నటించడం ఏంటి అని ఆశ్చర్యపోయారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిరి ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
"""/" /
నాకు జవాన్ టీం నుంచి ఈ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తున్నట్టు ఫోన్ చేశారు.
అయితే షారుక్ ఖాన్ సినిమాలో మనకు అవకాశం రావడం ఏంటి అని ఇది ఫ్రాంక్ కావాలనుకుని నేను కొట్టి పారేశాను అయితే ఓ మేనేజర్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం నిజమేనని చెప్పడంతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలియజేశారు.
ఇక ముంబై నాకు కొత్త కావడంతో నేను శ్రీహాన్( Srihan ) ను తోడు తీసుకొని ముంబై వెళ్లానని అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఇది షారుక్ ఖాన్ సినిమానా అని చాలామందిని అడిగానని తెలిపారు.
"""/" /
ఇక ఒక సన్నివేశం షూట్ చేసే సమయంలో తాను ఏడు టేకులు తీసుకోవడంతో పరోక్షంగా డైరెక్టర్ అట్లీ( Director Atlee ) నాపై అరిచారని ఈ సందర్భంగా సిరి తెలియజేశారు.
ఇక షారుక్ ఖాన్ తో నటిస్తున్న సమయంలో తనకు కంగారు భయం వేయడంతో ఏడ్చేసానని తెలిపారు.
దాంతో షారుఖ్ ఖాన్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా మీరు పెద్ద హీరో మీ పక్కన నటించాలంటే నాకు భయంగా ఉందని చెప్పడంతో ఆయన నేను చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉన్నాను కదా భయంకరంగా లేను నువ్వు చేయగలవు అంటూ షారుక్ ఖాన్ గారు తనను ఎంతగానో ప్రోత్సహించారు అంటూ ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ సిరి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.