శ్రీహన్ హీరోగా ఆవారా జిందగీ ఫస్ట్ లుక్.. నెట్టింట్లో వైరల్!
TeluguStop.com
తెలుగు బుల్లితెర పేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
శ్రీహన్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు బుల్లితెరపై తన సత్తాను నిరూపించుకున్న శ్రీహన్ త్వరలోనే వెండితెర పైకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.
శ్రీహాన్ నటించిన ఆవారా జిందగీ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లో ఉండంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు చిత్ర బృందం.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఈ సినిమాకు దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించినట్టుగా తెలుస్తోంది.
"""/"/
విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆవారా జిందగి ఫస్ట్ లుక్ లో నలుగురు కుర్రాళ్ల లుక్స్‌తో జీరో లాజిక్, 100 శాతం ఫన్ అంటూ క్యాప్షన్ అని రాసుకోచ్చారు.
కాగా ఆ లుక్ లో చార్మినార్, పిస్తోల్, 2 వేల రూపాయల నోట్లు, హైదరాబాద్ పోలీస్ బోర్డులు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హైదరాబాద్ నగరంలో ఆ నలుగురు కుర్రాళ్ల ఆవారా పనులు ఎలా ఉండబోతున్నాయనేది తెరపై కామెడీ యాంగిల్‌లో చూపించినట్లు పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది.
కాగా ఇందులో శ్రీహాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా,ముక్కు అవినాష్ తమ్ముడు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!