బిగ్ బాస్ షో నుంచి షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఎలిమినేట్ అయింది అతనేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్8 లో షాకింగ్ ఎలిమినేషన్లు చోటు చేసుకుంటున్నాయి.

తొలి వారం బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా రెండో వారం ఎవరూ ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శేఖర్ బాషా ఎలిమినేట్ కానున్నారని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ అభిమానులకు ఈ వార్త ఒకింత షాక్ అనే చెప్పాలి.అయితే శేఖర్ బాషా( Shekhar Basha ) ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్ ఉందని ఆయన ఎలిమినేషన్( Elimination ) సెల్ఫ్ ఎలిమినేషన్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శేఖర్ బాషాకు కొన్ని గంటల క్రితం కొడుకు పుట్టాడని తెలుస్తోంది.ఇలాంటి సమయంలో భార్యకు తోడుగా ఉండాలని శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే బిగ్ బాస్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.

"""/" / శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శేఖర్ బాషా సీక్రెట్ రూమ్ లో ఉండబోతున్నాడనే చర్చ సైతం సోషల్ మీడియా జరుగుతోంది.

బిగ్ బాస్ షో సీజన్8 రేటింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

శేఖర్ బాషా ఎలిమినేషన్ జరిగితే తాము తట్టుకోలేమని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

"""/" / బిగ్ బాస్ షోలో రేపు ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలి.

బిగ్ బాస్ షో ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది.

ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు సైతం మంచి పేరు వస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల రేంజ్ మారాలని ఆ షో అభిమానులు ఫీలవుతున్నారు.

వైరల్ వీడియో: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో విందు ఏర్పాటు