బిగ్ బాస్7 ఫైనల్ కంటెస్టెంట్ల జాబితా ఇదే.. కిక్కిచ్చే కంటెస్టెంట్లే షోలో ఉన్నారంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season 7 ) మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న సంగతి తెలిసిందే.

ఆదివారం బిగ్ బాస్ షో సీజన్ గ్రాండ్ గా లాంఛ్ కానుండగా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ కంటెస్టెంట్లు కచ్చితంగా బిగ్ బాస్ షోలో సందడి చేయనున్నారని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది.

చివరి నిమిషంలో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల విషయంలో కీలక మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.

కొంతమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో ఆఫర్ ను వదులుకోగా మరి కొందరు కంటెస్టెంట్లకు షో నిర్వాహకులు హ్యాండ్ ఇచ్చారని సమాచారం అందుతోంది.

సాగర్, శీతల్ గౌతమన్, రంగస్థలం మహేష్, అనీల్ గీలా బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నారని సమాచారం.

ప్రముఖ నటుడు శివాజీ, ప్రియాంక జైన్, జబర్దస్త్ నరేష్, శోభా శెట్టి, యువ సామ్రాట్ అనే కామన్ మ్యాన్, షకీలా( Shakeela ), నటి అపూర్వ కనిపించనున్నారని తెలుస్తోంది.

"""/" / సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కూడా ఈ షోలో కనిపించనున్నారు.అర్జున్ అంబటి( Ambati Arjun ) అమర్ దీప్ కూడా ఈ షోలో కనిపించనున్నారని తెలుస్తోంది.

చేతన్ సాయి అనే నటుడు కూడా ఈ షోలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

ఆట సందీప్ కూడా ఈ షోలో కనిపించనున్నారు.పూజామూర్తి అనే సీరియల్ నటి కూడా ఈ షోలో కనిపించనున్నారని భోగట్టా.

"""/" / టేస్టీ తేజ( Tasty Teja ) కూడా ఈ షోలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.

మరొ కొందరు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు ఉండనున్నారు.క్రేజ్ ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

బిగ్ బాస్ షో రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.ఈ షో కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆ సినిమాల విషయంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్న ప్రభాస్.. ఆలస్యమైతే ఇబ్బందేనా?