బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, యువ రైతు.. ఈ షో పక్కా హిట్ అంటూ?
TeluguStop.com
బుల్లితెర ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss Show Season7 ) కోసం బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాగార్జున బిగ్ బాస్ సీజన్7 కచ్చితంగా ఆకట్టుకుంటుందని ప్రోమోల ద్వారా చెబుతుండగా ఆయన నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.
అయితే బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, యువ రైతు( Young Farmer ) కనిపిస్తారని సోషల్ మీడియా వేదికగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అలనాటి స్టార్ హీరో అబ్బాస్( Star Hero Abbas ) ఈ మధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రముఖ నటుడికి బిగ్ బాస్ షోలో ఆఫర్ దక్కిందని సమాచారం.తెలుగులో అల్లరి నరేష్ కు జోడీగా పలు సినిమాలలో నటించిన ఫర్జానా( Farzana ) కూడా బిగ్ బాస్ షో సీజన్7లో కనిపించనున్నారని తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం బిగ్ బాస్7 పక్కా హిట్ అని చెప్పవచ్చు.
"""/" /
అదే సమయంలో బిగ్ బాస్ షో సీజన్7లో యువ రైతు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తున్న పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) సోషల్ మీడియా స్టార్ కేటగిరీలో ఈ షోకు ఎంపికైనట్టు తెలుస్తోంది.
మరో పది రోజుల్లో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
"""/" /
బిగ్ బాస్ షో సీజన్7 కోసం ఈ షో నిర్వాహకులు భారీ మొత్తం ఖర్చు చేయనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ షో సీజన్7కు నాగ్ హోస్ట్ గా కొనసాగిస్తుండగా ఈ షో అంచనాలను మించి హిట్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బిగ్ బాస్ షో నిర్వాహకులు ఈ షోపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ప్రియురాలి దారుణ హత్య .. యూకేలో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు